బాహుబలితో లక్కీగా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడని.. ప్రభాస్‌ది వాపే తప్ప బలుపు కాదని.. ఎన్నెన్నో కామెంట్లు చేశారు గత కొన్నేళ్లలో.. ప్రభాస్‌ను లాటరీ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేసేవాళ్లు కూడా ఉన్నారు. బాహుబలి తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు పడేసరికి అతణ్ని ఇలా తక్కువ చేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు. కానీ బాహుబలి అంత పెద్ద బ్లాక్‌బస్టర్ కావడంలో ప్రభాస్ పాత్రను తక్కువ చేయలేం.
ఇక బాహుబలితో అతను సంపాదించుకున్నది మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కాదన్న విషయమూ అంగీకరించాల్సిందే. వరుసగా మూడు డిజాస్టర్ల తర్వాత కూడా సలార్‌కు వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు అందుకు నిదర్శనం. ఇక తన లేటెస్ట మూవీ కల్కి 2898 ఏడీతో ప్రభాస్ సాగించిన వసూళ్ల ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తొలి రోజు నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోతున్న కల్కి ఇప్పుడు ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్ల మార్కును అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి గ్రాస్ వసూళ్లు వెయ్యి కోట్ల మైలురాయిని దాటేశాయి. ఇండియా వరకే వసూళ్లు రూ.800 కోట్లకు చేరువగా ఉండగా.. విదేశాల్లో వసూళ్లు రూ.200 కోట్లు దాటిపోయాయి.
సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల మైలురాయిని రెండు సార్లు అందుకున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ గత ఏడాదే ఈ ఘనత సాధించాడు. పఠాన్, జవాన్ సినిమాలు రెండూ వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టాయి. సౌత్ నుంచి కేజీఎఫ్-2తో యశ్ ఈ క్లబ్బులో అడుగు పెట్టాడు. బాహుబలి-2తో తొలిసారి వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టిన ప్రభాస్ ఇప్పుడు కల్కితో మరోమారు ఆ ఘనత సాధించాడు. భవిష్యత్తులో కల్కి-2, స్పిరిట్ లాంటి చిత్రాలతోనూ ప్రభాస్ ఈ మైలురాయిని మళ్లీ టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
This post was last modified on July 14, 2024 10:03 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…