నిన్న అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి భారతీయ తారాలోకం మొత్తం తరలి వచ్చింది. ఒకరిద్దరు తప్ప అందరూ హాజరయ్యారు. ఎన్నడూ లేనిది ఒక ప్రైవేట్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ డాన్స్ చేయడం చూసి అక్కడున్న వాళ్లే కాదు ఆన్ లైన్ వీడియో చూసినవాళ్లు సైతం పెద్ద షాక్ తిన్నారు. షారుఖ్ ఖాన్ తో మొదలుపెట్టి విక్కీ కౌశల్ దాకా, రామ్ చరణ్ నుంచి అఖిల్ దాకా అన్ని బాషల నుంచి వచ్చిన స్టార్ల సందడితో పెళ్లి మండపం కొత్త శోభను సంతరించుకుంది. అయితే ఎక్కువ దృష్టిని ఆకర్షించింది మాత్రం మహేష్ బాబేనని ఒప్పుకోవాల్సిన నిజం.
రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ కోసం సిద్ధమవుతున్న మహేష్ బాబు ఆ లుక్ కోసమే ప్రత్యేకంగా బారెడు జుత్తు పెంచి కొత్త మేకోవర్ కి వచ్చాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ ట్రై చేయని గెటప్ ఇది. నలభై ఎనిమిదేళ్ల వయసులో ఇంత ఎనర్జిటిక్ గా ఉండటం చూసి మగాళ్లే దిష్టి పెట్టేలా ఉన్నారు. జక్కన్న మాములుగా హీరోల శారీరక దారుఢ్యం మీద ఎక్కువ దృష్టి పెడతాడు. ఈసారి దాంతో పాటు మహేష్ అందం మీద స్పెషల్ ఫోకస్ ఉంచాడు. అందులో భాగంగానే ప్రత్యేకంగా డిజైన్ చేయించిన లుక్ ఇది. అలా అని ఫ్యాన్స్ ఇక్కడితో సంబరపడేందుకు లేదు. అసలు ట్విస్టు వేరే ఉంది.
కథ ప్రకారం మహేష్ బాబు గెటప్ వేరే ఉంది. దానికి సిద్ధమవ్వాలంటే ముందు జులపాల జుత్తు కావాలి. ఆ తర్వాత స్టయిలిష్ట్ రంగంలోకి దిగుతాడు. రాజమౌళి సూచనల మేరకు మారుస్తాడు. ఇటీవలే జరిగిన ఫోటో షూట్ లో చిన్న ట్రయిల్ వేశారు కానీ ఇంకా లాక్ చేయలేదు. ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఇక మహేష్ బాబు ఏ కారణం చేతనూ బయట కనిపించడం ఉండదు. అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే హెయిర్ స్టైల్ కనిపించకుండా క్యాప్ తో పాటు మాస్కు కూడా ఉండొచ్చు. ఏదైతేనేం మహేష్ ని ఎలాగైతే అభిమానులు చూడాలనుకుంటున్నారో అంతకు మించే జక్కన్న ప్రెజెంట్ చేయబోతున్నారు.
This post was last modified on July 13, 2024 12:11 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…