నిన్న విడుదలైన అక్షయ్ కుమార్ సర్ఫిరాకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది ముందే ఊహించిందే అయినా అనుకున్న దాని కన్నా తక్కువ ఫిగర్లు నమోదు కావడం బాలీవుడ్ ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. సూర్య ఆకాశం నీ హద్దురా రీమేక్ గా రూపొందిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ పట్ల ప్రేక్షకులు ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదని ప్రమోషన్ల టైంలోనే అర్థమైపోయింది. మూడేళ్ళ క్రితమే ఒరిజినల్ వెర్షన్ హిందీ డబ్బింగ్ తో సహా అమెజాన్ ప్రైమ్ లో కోట్లాది ఆడియన్స్ చూసేశారు. అయినా సరే రిస్క్ చేసి మరీ ముచ్చటపడిన అక్షయ్ కుమార్ కి మరో డిజాస్టర్ లిస్టులోకి చేరింది.
సుధా కొంగరనే దర్శకురాలిగా తీసుకుని ఏ మార్పులు చేయకుండా యథాతథంగా తీసినప్పటికి సర్ఫిరాని జనాలు అంగీకరించలేదు. అక్షయ్ వైపు నుంచి పెర్ఫార్మన్స్ పరంగా ఎలాంటి ఫిర్యాదు లేదు. ఎటొచ్చి ఎంటర్ టైన్మెంట్ లేకుండా కేవలం సీరియస్ మోడ్ లో కథను చెప్పడం మాస్ కి నచ్చలేదు. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఆకాశం నీ హద్దురా డైరెక్ట్ ఓటిటిలో వచ్చినప్పుడు లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో కోట్లాది వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి. దానికి తోడు సూర్య టెర్రిఫిక్ నటన కట్టిపడేసింది. కానీ అక్షయ్ అతన్ని మ్యాచ్ చేయలేకపోయాడు.
వేగంగా సినిమాలు చేయడమే తప్ప జయాపజయాలను సీరియస్ గా తీసుకొని అక్షయ్ కుమార్ దానికి తగ్గ మూల్యాన్నే చెల్లిస్తున్నాడు. ఆ మధ్య బడేమియా చోటేమియాతో అత్యంత దారుణమైన ఫ్లాప్ ని అందుకున్న తక్కువ గ్యాప్ లోనే సర్ఫిరా నిరాశ పరచడం అభిమానులను కలవరానికి గురి చేసేదే. అయినా సకాలంలో రీమేక్ చేయకుండా ఇలా సంవత్సరాల తరబడి సమయం వృథా చేస్తూ ఉంటే ఇలాంటి ఫలితాలు కాకుండా ఇంకేమొస్తాయి. సర్ఫిరా ఆశలన్నీ వీకెండ్ రెండు రోజుల మీద ఉన్నాయి. పికప్ అయ్యిందా అదృష్టం. లేదంటే నష్టాలు కంచికి బయ్యర్లు ఇంటికి.
This post was last modified on July 13, 2024 12:06 pm
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…