‘భారతీయుడు-2’ మొదలైనపుడు దాన్ని ఒక సినిమాగానే అనుకున్నారు. కానీ మధ్యలో అది రెండు భాగాలుగా మారింది. గతంలో బాహుబలి, యన్.టి.ఆర్, పుష్ప లాంటి చిత్రాలను కూడా ఇలాగే మధ్యలో రెండు భాగాలుగా మార్చారు. ఐతే ‘బాహుబలి’, ‘పుష్ప’ చిత్రాల విషయంలో ఆ ఐడియా బాగానే వర్కవుట్ అయింది. కానీ ‘యన్.టి.ఆర్’ సినిమా మాత్రం తేడా కొట్టింది.
‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమా రిలీజై నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినపుడు ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ సినిమా పరిస్థితి ఏంటా అని అందరూ కంగారు పడ్డారు. అప్పటికే ఆ సినిమా చిత్రీకరణ 80 శాతం దాకా పూర్తయింది. విధిలేని పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్‌ను మించి రెండో భాగం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు ‘ఇండియన్-2’ రిలీజ్ టైంలో చాలామందికి ‘యన్.టి.ఆర్’ సినిమా గుర్తుకు వస్తుంటే ఆశ్చర్యం లేదు.
‘ఇండియన్-2’, ‘ఇండియన్-3’ సినిమాలను ఒకేసారి శంకర్ పూర్తి చేసేశాడు. పార్ట్-3కి సంబంధించి చిత్రీకరణ అంతా పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ‘ఇండియన్-2’కు పూర్తిగా నెగెటివ్ టాక్ వస్తోంది. రివ్యూలకు తోడు మౌత్ టాక్ కూడా ఏమాత్రం బాగా లేదు. ఈ సినిమా చూశాక జనం పార్ట్-3 కోసం ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది సందేహం. ఇండియన్-2 చివర్లో ప్రదర్శించిన ట్రైలర్ చూస్తే కొంచెం ఆసక్తికరంగానే అనిపిస్తోంది. కానీ ఫెయిల్యూర్ సినిమాకు సీక్వెల్ వర్కవుట్ కావడం చాలా కష్టం.
‘ఇండియన్-2’కు ఓపెనింగ్స్ అయినా ఉన్నాయి.. కానీ పార్ట్-3కి అది కూడా కష్టం కావచ్చు. ఈ చిత్రానికి కూడా ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ తరహా ఫెయిల్యూర్ అనివార్యం అనే ఫీలింగ్ కలుగుతోంది. మరి పార్ట్-2 ఫెయిల్యూర్ తర్వాత మూడో భాగం జనాల్ని మెప్పించి హిట్టయితే అది అద్భుతమే అనుకోవాలి.
This post was last modified on July 13, 2024 10:37 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…