వెయ్యికి పైగా సినిమాల్లో అమోఘమైన పాత్రలతో రెండు మూడు తరాలను ఏకధాటిగా నవ్వించిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందంని తెరమీద చూసిన క్షణమే ఎంత కోపంగా ఉన్న మనిషికైనా సరే పెదవుల మీదకు నవ్వు వచ్చేస్తుంది.
ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ, రేలంగి, ఎస్వి కృష్ణారెడ్డి లాంటి లెజెండరీ దర్శకులు ఆయన క్యాలిబర్ కు తగ్గ క్యారెక్టర్లు రాసుకుని అద్భుతమైన ఫలితాలు అందుకున్నారు. అంతెందుకు సీరియస్ కథలను డీల్ చేసిన రామ్ గోపాల్ వర్మ సైతం అనగనగా ఒక రోజులో బ్రహ్మితో చేయించిన నెల్లూరు పెద్దారెడ్డి కామెడీ ఎన్ని దశాబ్దాలు దాటినా ఫ్రెష్ గానే అనిపిస్తుంది.
కానీ ఇప్పటి డైరెక్టర్లు బ్రహ్మానందాన్ని వాడుకోవడంలో విఫలం చెందుతున్నారు. మొక్కుబడిగా ఆయన్ను తీసుకోవడం కాదు ఒక్క సీన్ అయినా సరే సరైన డైలాగులు, బాడీ లాంగ్వేజ్ రాస్తే వాటిని నిలబెట్టుకోవచ్చని జాతిరత్నాలుతో అనుదీప్ నిరూపించాడు.
క్లైమాక్స్ కోర్టు సన్నివేశంలో బ్రహ్మి మేనరిజం నవీన్ పోలిశెట్టికి ధీటుగా పండింది. కానీ ఇది అందరివల్లా కావడం లేదు. నిన్న రిలీజైన భారతీయుడు 2లో ఆయన కేవలం కొద్ది సెకండ్లే కనిపించి నిరాశపరిచారు. ఈ మాత్రం దానికి పెద్దాయన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకొచ్చి చెన్నై, హైదరాబాద్ రెండు చోట్లా మాట్లాడించారు. కానీ ఇది ఒక్క శంకర్ తప్పు మాత్రమే కాదు.
ఇటీవలే వచ్చిన బాక్సాఫీస్ సెన్సేషన్ కల్కి 2898 ఏడిలోనూ ఏదో ఉండాలంటే ఉన్నారంతే. పవన్ కళ్యాణ్ బ్రోలో హోమం చేయించే పూజారిగా చూపిస్తే తెరమీద పేలలేదు. భీమ్లా నాయక్, కీడా కోలా, బబుల్ గమ్, ఖుషి, ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఇవన్నీ వైఫల్యం చెందినవే.
సీరియస్ పెర్ఫార్మన్స్ రాబట్టుకున్న రంగమార్తాండ, పంచతంత్రంలు బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. ఏతావాతా తేలేది ఏంటంటే ఎంత వయసు మీద పడుతున్నా బ్రహ్మానందం గారిలో జోష్ అలాగే ఉంది. సరిగ్గా వాడుకుంటే ఆయన ఎంత అడిగినా ఇస్తాడు. నామ్ కే వస్తే పెట్టుకుంటే ఆయన మాత్రం చేయగలిగింది ఏముంది.
This post was last modified on July 13, 2024 10:27 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…