మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాలో లిరికల్ సాంగ్ వచ్చినప్పటి నుంచి దాని మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముందు రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య వయసు వ్యత్యాసం గురించి కొన్ని మీమ్స్ వచ్చాయి. ఇతని కన్నా సీనియర్ స్టార్లు సగం కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో ఆడిపాడినప్పుడు రాని అభ్యంతరం కేవలం తమ హీరో చేస్తున్నప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయా అంటూ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు వేశారు. ధమాకా టైంలోనూ ఇలాంటివి జరిగాయి. శ్రీలీల జోడి గురించి వచ్చిన కామెంట్స్ రిలీజయ్యాక ఆగిపోవడం మర్చిపోయేది కాదు.
ఈసారి రవితేజతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ ని కొందరు లక్ష్యంగా పెట్టుకున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాటలో భాగ్యశ్రీ మొహం కన్నా ఆమె శరీరాన్నే ఎక్కువ హైలైట్ చేశారంటూ ఒక స్టెప్పుని పదే పదే రిపీట్ మోడ్ లో చూపిస్తూ ఆయనేదో గతంలో ఎవరూ చేయించని ఎక్స్ పోజింగ్ చూపించారనే రేంజ్ లో కామెంట్స్ పెట్టారు. ఆధునిక రాఘవేంద్రరావు అంటూ కితాబు ఇస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయితే కేవలం మిస్టర్ బచ్చన్ మాత్రమే వీళ్లకు ఎందుకు కనిపిస్తోందనేది వేయి డాలర్ల ప్రశ్న. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది తప్పించి మరొకటి కాదని ఫ్యాన్స్ వాదన.
ధమాకా, వాల్తేరు వీరయ్య మినహాయించి గత కొన్నేళ్లలో రవితేజ సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. వేగంగా సినిమాలు చేయడంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల ఫెయిల్యూర్స్ వచ్చాయి. అలా అని మాస్ రాజా అన్నీ రొటీన్ కమర్షియల్ కథలు చేయలేదు. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ఈగల్ జానర్ల పరంగా చాలా డిఫరెంట్ అటెంప్ట్స్. కాకపోతే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా దర్శకులు తీయలేకపోయారు. మిస్టర్ బచ్చన్ బాలీవుడ్ రైడ్ రీమేక్ అయినప్పటికి కీలక మార్పులతో మంచి బజ్ తెచ్చుకుంది. ఇలాంటి టైంలో కావాలని బురద చల్లడం చూస్తే బజ్ తగ్గించే ప్రయత్నమేమోననిపిస్తుంది.
This post was last modified on July 11, 2024 3:44 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…