వెయ్యి కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న కల్కి 2898 ఏడి దూకుడు ఇప్పుడు కొంత తగ్గినట్టు అనిపిస్తున్నా తిరిగి వీకెండ్ నుంచి ఊపందుకోవడం ఖాయమని బయ్యర్లు నమ్మకంగా ఉన్నారు. భారతీయుడు 2 వస్తున్నా సరే ఇంకా థియేటర్లకు వెళ్లని ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రభాస్ మూవీనే బెస్ట్ ఛాయస్ అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా కల్కి విజయం, అందులో చూపించిన విజువల్స్ ఇతర దర్శక నిర్మాతలను ఎంతగా ప్రభావితం చేశాయో చెప్పే ఉదాహరణలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వాళ్లలో ఒకరు జ్ఞానవేల్ రాజా.
అక్టోబర్ 10 విడుదల కాబోతున్న కంగువని ఎంత భారీ బడ్జెట్ తో తీశారో తెలిసిందే. రెండో భాగాలుగా ప్లాన్ చేసుకుని సూర్య కెరీర్ లోనే కాదు తమిళ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 10 విడుదలకు తగ్గట్టు ఇప్పటి నుంచే ప్రమోషన్లు షురూ చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ కల్కి 2898 చూశాక తనకు మూడు రోజులు నిద్ర లేదని, దీని ప్రభావం సౌత్ ఇండియన్ సినిమా మీద ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచిస్తూ గడిపేశానని అన్నారు. కంగువ రిలీజ్ డేట్ ప్రకటించింది కల్కి థియేటర్లలో వచ్చిన రోజే కావడం గమనార్హం.
దీన్ని బట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ ని ఇతరులు పూర్తిగా అంచనా వేయలేకపోయిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కంగువతో బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్న సూర్య బృందం ఇప్పుడు తమ లిస్టులో కల్కి 2898 ఏడిని చేర్చుకుంటున్నారు. తెలుగు వెర్షన్ కు చాలా క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఒక నైజామే ఇరవై కోట్ల దాకా పలికిందనే వార్త రెండు రోజుల క్రితం తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడా ప్రొడ్యూసరే కల్కిని చూసి టెన్షన్ పడ్డారంటే దాని ఇంపాక్ట్ గురించి వేరే చెప్పాలా. దానికన్నా ముందు దేవర వస్తుంది. అది చూశాక ఏమంటారో మరి.
This post was last modified on July 10, 2024 2:16 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…