కల్కి సినిమాలో విజువల్స్.. కొన్ని ఎపిసోడ్లు చూసి ప్రేక్షకులు అబ్బురపడ్డారు. అలా అని ఈ సినిమా మీద విమర్శలు లేవా అంటే అదేమీ కాదు. ఈ సినిమాను కొనియాడుతూనే విమర్శలూ చూశారు ప్రేక్షకులు. ముఖ్యంగా మూడు గంటలకు పైగా ఉన్న నిడివి విషయంలో అసంతృప్తి వ్యక్తమైంది. కొన్ని సన్నివేశాలు సాగతీతగా ఉన్నాయని, బోర్ కొట్టిందని అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు.
నిడివి ఎక్కువైందనే విమర్శలను తాను సానుకూలంగానే తీసుకుంటానని చెప్పాడు. అసలు నిడివి ఎందుకు పెరిగిందో అతను వివరించే ప్రయత్నం చేశాడు.
”కొందరు దీని రన్‌టైమ్‌ను విమర్శించారు. నేను విమర్శలను కూడా సానుకూలంగానే తీసుకుంటాను. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు తెలియని పాయింట్లు చాలా ఉంటాయి. ఇది మొదటి భాగం. ఇందులోనే అన్ని పాత్రలను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.కొన్ని సినిమాలకు ఎంత టైం ఇచ్చినా ఎడిటింగ్‌కు సరిపోదు. కల్కికి ఇంకో నెల రోజులు టైం ఉండి ఉంటే బాగుండనిపించింది. అందుకే అంత నిడివి వచ్చింది కొందరు కల్కిని ‘మహానటి’తో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, కల్కికి చాలా తేడా ఉంది. రెండూ భిన్నమైన కథలు. అది కేవలం ఒక మహిళకు చెందిన కథ, ఆమె పాత్ర మాత్రమే ప్రధానమైనది. కానీ ఇందులో చాలామంది అగ్రతారలు ఉన్నారు. వాళ్ల పాత్రలన్నీ కీలకమైనవే. వాళ్ల పాత్ర చుట్టూ కథ అల్లుకుపోవాలి” అని అని నాగ్ అశ్విన్ చెప్పాడు.
కల్కి సినిమా మారుమూల ప్రాంతాల జనాలకు కూడా విపరీతంగా నచ్చిందని.. సినిమాకు వచ్చిన స్పందన చూస్తే అమితానందంగా ఉందని నాగ్ అశ్విన్ తెలిపాడు. సినిమా కోసం పడ్డ కష్టమంతా ఫలితం చూశాక మరిచిపోయినట్లు అతను చెప్పాడు. ప్రస్తుతం కల్కి కలెక్షన్లు రూ.800 కోట్ల మార్కును దాటేశాయి.
This post was last modified on July 9, 2024 10:08 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, విడుదల వ్యవహారం సంచలనం…
ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుండగా.. ఆ సినిమా వాయిదా…
అల్లరి నరేష్ కెరీర్లో అతి పెద్ద హిట్.. సుడిగాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తమిళ్ పడం’ ఆధారంగా తెరకెక్కినప్పటికీ.. తెలుగు…
కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రికార్డులు సాధించిన సినిమాలు తీరా ఓటిటిలో వచ్చాక ఆశించిన స్పందన తెచ్చుకోలేక నీరసపడతాయి.…
ఇటీవల నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్‌తో గొడవ నేపథ్యంలో వీరి గురించి…
ఆర్థిక నేరస్తుడు.. ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త.. కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు.. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర…