ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు, దక్షిణాది చిత్రాలకు చాలా అంతరం ఉండేది. హిందీ చిత్రాల ముందు మన ప్రాంతీయ భాషా చిత్రాలు నిలిచేవి కావు. వాటి బడ్జెట్లు, వసూళ్లు అన్నీ కూడా పెద్ద రేంజిలో ఉండేవి. కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల ముందు బాలీవుడ్ చిత్రాలే నిలవలేకపోతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు సౌత్ సినిమాలు హిందీ చిత్రాల మీద ఆధిపత్యం చలాయించాయి. ఉత్తరాదిన హిందీ సినిమాలను మించి వసూళ్లు కొల్లగొట్టాయి.
ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌కు సౌత్ సినిమా ఝలక్ ఇచ్చింది. 2024లో సగం నెలలు గడిచిపోగా.. ప్రస్తుతం హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఓ తెలుగు సినిమా నిలవడం విశేషం. ఆ చిత్రమే.. కల్కి.
ఇప్పటిదాకా జనవరిలో రిలీజైన హృతిక్ రోషన్ మూవీ ‘ఫైటర్’యే 2024లో హైయెస్ట్ హిందీ గ్రాసర్ మూవీగా ఉంది. ఆ చిత్రం రూ.215 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఐతే గత నెల 27న విడుదలైన ‘కల్కి’ హిందీలో ఆరంభం నుంచి నిలకడగా వసూళ్లు సాధిస్తూ రూ.200 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పుడు రిలీజైన 12వ రోజు ఈ చిత్రం ‘ఫైటర్’ కలెక్షన్లను దాటేసింది. రెండో వీకెండ్లోనూ ‘కల్కి’ భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ రోజూ పది కోట్లకు తక్కువ కాకుండా హిందీ వెర్షన్ వసూళ్లు రాబడుతోంది.
ఫుల్ రన్లో రూ.250 కోట్ల మార్కును కూడా ‘కల్కి’ అందుకునే అవకాశాలున్నాయి. ఏడాది చివర్లో కొన్ని పెద్ద హిందీ చిత్రాలు రావాల్సి ఉంది. అంత వరకు ‘కల్కి’నే 2024 హైయెస్ట్ హిందీ గ్రాసర్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది బాలీవుడ్ ఫిలిం మేకర్స్, హీరోలకు కచ్చితంగా ఇబ్బంది కలిగించే విషయమే.
This post was last modified on July 9, 2024 10:01 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…