హిట్టు ఫ్లాపు పక్కనపెడితే మార్కెట్ హెచ్చుతగ్గులకు గురై ఉండొచ్చు కానీ సరైన సినిమా పడితే సూర్య క్రేజ్ తెలుగులోనూ భారీగా ఉంటుందని ఈ మధ్య కంగువ ఆఫర్లను చూస్తే అర్థమవుతుంది. రెండేళ్లకు పైగా దీని కోసమే త్యాగం చేసిన ఈ వర్సటైల్ యాక్టర్ అక్టోబర్ పదో తేదీ ఇండియన్ స్క్రీన్ మీద బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాడని చెన్నై మీడియా టాక్. ఇప్పుడు శివపుత్రుడు టాపిక్ ఎందుకో చూద్దాం. సూర్య కెరీర్ లోనే కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా దర్శకుడు బాలాతో ఇదే కాంబోతో మొన్నటి ఏడాది వనంగాన్ అనే మూవీ మొదలుపెట్టారు. కృతి శెట్టి హీరోయిన్ గా కొంత భాగం షూటింగ్ జరిగింది.
ఆ తర్వాత హీరో దర్శకుడికి మధ్య వచ్చిన విభేదాల వల్ల ప్రాజెక్టుని అర్ధాంతరంగా ఆపేశారు. అయినా బాలాకు వనంగాన్ స్క్రిప్ట్ మీద బలమైన నమ్మకం. మంచి పెర్ఫార్మర్ దొరికితే ఇంకో క్లాసిక్ అవుతుందని భావించి సాహోలో విలన్ గా మనకు పరిచయమున్న అరుణ్ విజయ్ ని తీసుకున్నాడు. చిత్రీకరణ అయిపోయింది. విడుదలకు రెడీ చేస్తున్నారు. నిన్న తమిళ ట్రైలర్ వచ్చింది. బాలా మేకింగ్ స్టయిల్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. అరుణ్ విజయ్ తో ఒక్క డైలాగు చెప్పించకుండా కేవలం ఎక్స్ ప్రెషన్లతో మరో సీరియస్ కథను తెరమీద చూపించబోతున్నట్టు అర్థమైపోయింది.
ఈ లెక్కన చూస్తే సూర్య అయితే ఇంకా అదరగొట్టేవాడన్న కామెంట్స్ ని నిజం ఉంది. అలా అని అరుణ్ విజయ్ నిరాశ పరచలేదు. తనలో మరో కోణాన్ని బాలా వెతికి తీశాడు. కృతి శెట్టికి సైతం ఒక మంచి ఆఫర్ మిస్ అయినట్టేనని చెప్పాలి. ఆ పాత్రను రోషిణి ప్రకాష్ పోషించింది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా డెప్త్ గా సాగింది. అయినా బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందన్నట్టు ఆర్టిస్టులకు కూడా కొన్ని సినిమాలు అలా విధి లిఖితంగా ఉంటాయి. వనంగాన్ ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. డేట్ ఫిక్సవ్వలేదు.
This post was last modified on July 9, 2024 3:40 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…