తెలుగు సినిమాల్లో ఈ మధ్య కనిపించడం తగ్గించేసినా బొమ్మరిల్లు సిద్దార్థ్ కు అభిమానుల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే మహా సముద్రంతో కంబ్యాక్ అన్నప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. దాని ఫలితం సంగతి ఎలా ఉన్నా ఒకప్పటి సిద్దు అలాగే ఉండటం చూసి ఫ్యాన్స్ సంతోషించారు. ఆ తర్వాత డబ్బింగ్ మూవీస్ టక్కర్, చిన్నాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేసినా కోరుకున్న రిజల్ట్ దక్కలేదు. వీటి సంగతలా ఉంచితే సిద్ధార్థ్ కు ఫిల్టర్ లేకుండా ఓపెన్ గా మాట్లాడతాడని పేరుంది. అది ఇవాళ భారతీయుడు 2 హైదరాబాద్ ప్రెస్ మీట్ లో బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే ఇటీవలే తెలంగాణ సిఎం పెద్ద హీరోలు తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కావాలంటే డ్రగ్స్ లాంటి మహమ్మారి మీద సోషల్ అవేర్నెస్ వీడియోలు చేసి ఇస్తేనే అనుమతులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీన్నే మీడియా ప్రతినిధులు సిద్దార్థ్ ముందు ప్రస్తావించగా తను అన్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఇరవై సంవత్సరాల కెరీర్ లో ఎప్పుడో 2005లోనే కాండోమ్స్ వాడమని చెప్పి సామజిక బాధ్యత తీసుకున్న హీరోనని, ఏ ముఖ్యమంత్రి తమకు ఇది చేస్తే మీకు ఇది ఇస్తామని అడగలేదని, ఇన్ డైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కండీషన్ మీద పంచు వేశాడు.
సరే సిద్దార్థ్ ఉద్దేశం ఏదైనా రెండు వైపులా ఆలోచిస్తే ఇద్దరూ కరెక్టేనని చెప్పాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వీడియో నిబంధన సమాజానికి మేలు చేసేది. స్పృహ కలిగించే సందేశం సెలబ్రిటీల ద్వారా త్వరగా చేరుతుంది. సిద్దార్థ్ చెప్పినట్టు గతంలో ఎవరూ అడగకపోయి ఉండొచ్చు కానీ మొదలంటూ ఒకరు చేస్తే క్రమంగా మరొకరు ఫాలో అయ్యేందుకు అవకాశం ఇస్తుంది. పైగా అందులో రిస్క్ ఏమీ లేదు. మహా అయితే ఒక రోజు షూట్ మించి ఉండదు. టికెట్ రేట్ల వల్ల కోట్లాది రూపాయల అదనపు ఓపెనింగ్స్ వచ్చినప్పుడు యాడ్స్ చేయడంలో తప్పేమి లేదు. సరే ఎవరి ఆలోచన వాళ్ళది.