Movie News

బ్రహ్మిది మామూలు టాలెంట్ కాదు

టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం నట ప్రతిభ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్లో చాలా వరకు కామెడీ రోల్సే చేయడం వల్ల ఆయన్ని ఆ కోణంలోనే ప్రేక్షకులు చూశారు కానీ.. ‘బాబాయ్ హోటల్’ లాంటి చిత్రాలు చూస్తే ఆయన ఎమోషన్లను కూడా ఎంత గొప్పగా పండించగలరో అర్థమవుతుంది. ఇక నటనను దాటి బ్రహ్మిలో ఎంతో ప్రతిభ ఉంది. తెలుగు పండితుడైన బ్రహ్మికి భాష, సాహిత్యం మీద గొప్ప పట్టుంది. ఆయన మంచి రచయిత, వక్త కూడా.

అలాగే బ్రహ్మిలో చిత్రకళా ప్రతిభ కూడా తరచూ బయటపడుతుంటుంది. ఆయన వేసిన బొమ్మలు అబ్బురపరుస్తాయి. వీటన్నింటికీ తోడు బ్రహ్మితో మిమిక్రీ కళ కూడా ఉంది. తన పాత్రల కోసం అప్పుడప్పుడూ ఆయన దాన్ని బయటికి తీస్తుంటారు. వేదికల మీద కూడా కొందరు ప్రముఖులను అనుకరిస్తుంటారు. తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్‌ను ఆయన ఇమిటేట్ చేసిన తీరు హాట్ టాపిక్‌గా మారింది.

కమల్ హీరోగా శంకర్ రూపొందించిన ‘ఇండియన్-2’లో బ్రహ్మి చిన్న క్యామియో చేశారు. శంకర్ పట్టుబట్టి బ్రహ్మితో ఈ పాత్ర చేయించారట. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన బ్రహ్మి.. సినిమా గురించి ప్రసంగమేమీ చేయకుండా కేవలం కమల్‌ను అనుకరించి వేదిక నుంచి దిగిపోయారు. మిమిక్రీ కళాకారులు చాలామంది నటులను అనుకరిస్తారు కానీ.. కమల్‌ వాయిస్‌ను ఇమిటేట్ చేయడం అంత ఈజీ కాదు. పైగా ఇప్పుడు వయసు పెరిగాక కమల్ వాయిస్‌లో మార్పు వచ్చింది.

ఇప్పుడున్న మిమిక్రీ ఆర్టిస్టులు యాజిటీజ్ ఆయన వాయిస్‌ను దించడం కష్టమనే చెప్పాలి. కానీ బ్రహ్మి మాత్రం కమల్ ఇప్పుడు బొంగురు పోయిన గొంతుతో ఎలా మాట్లాడతారో.. అచ్చం అదే స్టయిల్లో వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చి ఔరా అనిపించారు. కమల్ సైతం ఎంతో ఆసక్తిగా బ్రహ్మి ప్రసంగాన్ని విన్నారు. తర్వాత తన ప్రసంగంలో తాను చెప్పాలిందంతా తన వాయిస్‌లో బ్రహ్మానందమే చెప్పేశారంటూ ఆయన కళను కొనియాడారు.

This post was last modified on July 8, 2024 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాష్ట్రం వెంటిలేట‌ర్ పై ఉంది: చంద్ర‌బాబు

రాష్ట్రం వెంటిలేట‌ర్‌పై ఉంద‌ని.. అయితే..దీనిని బ‌య‌ట‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా…

9 mins ago

లక్కీ మీనాక్షి కి మరో దెబ్బ

టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…

27 mins ago

జ‌గ‌న్ చేసిన ‘7’ అతి పెద్ద త‌ప్పులు ఇవే: చంద్ర‌బాబు

జ‌గ‌న్ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. మ‌రీ ముఖ్యంగా కొన్ని త‌ప్పుల కార‌ణంగా.. రాష్ట్రం…

48 mins ago

కంగువ నెగిటివిటీ…సీక్వెల్…నిర్మాత స్పందన !

సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…

1 hour ago

విజ్ఞుడైన ప‌ద్మ‌నాభం.. ప‌రువు పోతోంది.. గుర్తించారా?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, వైసీపీ నేత ముద్రగ‌డ పద్మ‌నాభం.. చాలా రోజుల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. రాష్ట్రంలో…

3 hours ago

జగన్ లాగా టీచర్లతో బాత్రూమ్ పనులు చేయించం

వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…

3 hours ago