మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో తెలుగులో ఒక్కటి చెప్పుకోదగినది లేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఎలాంటి శబ్దం చేయకుండా వచ్చిన కిల్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం దీని గురించి అవగాహన లేని వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసింది. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించగా నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందే పలువురు మీడియా ప్రతినిధులకు స్పెషల్ ప్రీమియర్ వేసినప్పుడు దానికొచ్చిన స్పందన చూసి అందరూ షాక్ తిన్నారు. కానీ తీరా సినిమా చూశాక ఆ మాటలు నిజమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతగా కిల్ లో ఏముందో చూద్దాం.
ఎన్ఎస్జి కమెండో అమ్రిత్ రాథోడ్ (లక్ష్య లాల్వాని) ప్రియురాలు తులిక (తాన్య మంకితాల) కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరుగుతుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ నుంచి రాంచి వెళ్తున్న తులిక కుటుంబం ప్రయాణిస్తున్న రైల్లోకి బందిపోటు దొంగలు చొరబడతారు. వాళ్ళ నాయకుడి (ఆశిష్ విద్యార్ధి) ఆధ్వర్యంలో కనికరం లేకుండా అందరి సొత్తు దోచుకుని నలుగురి ప్రాణాలు తీస్తారు. అదే రైల్లో లవర్ కి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిన అమ్రిత్ కు వీళ్ళతో కలబడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఊహించని భయానక సంఘటనలు జరుగుతాయి. అవేంటి, చివరికి ఏం జరిగిందనేది తెరమీద చూడాలి.
తొలి ఇరవై నిముషాలు మినహాయిస్తే విపరీతమైన రక్తపాతంతో నిండిపోయిన కిల్ యాక్షన్ ప్లస్ క్రైమ్ లవర్స్ ని పూర్తిగా మెప్పిస్తుంది. ఒక రాత్రి జరిగే సంఘటనగా గంట నలభై నిమిషాల నిడివితో ఎక్కడా విసుగు లేకుండా స్క్రీన్ ప్లే పరుగులు పెట్టిన తీరు ఒళ్ళు గడుర్పొడిచేలా చేస్తుంది. మెయిన్ విలన్ గా నటించిన రాఘవ్ జుయల్ కూల్ విలనీతో భయపెట్టేస్తాడు. హత్యలు జరిగే తీరు మరీ జుగుప్స కలిగించేలా ఉన్నా దొంగల దుర్మార్గానికి అలా చేయడం న్యాయమనిపించే రీతిలో దర్శకుడు నిఖిల్ నగేష్ ఎమోషన్ ని ఎస్టాబ్లిష్ చేసెసిన తీరు అద్భుతం. కొన్ని లాజిక్స్ మిస్సయ్యాయి. ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంత మాత్రం రికమండ్ చేసే అవకాశం లేని కిల్ కేవలం హింస, ప్రతీకారాన్ని విపరీతంగా ఇష్టపడే మాస్ ఆడియన్స్ కు పిచ్చిగా నచ్చేస్తుంది.
This post was last modified on July 8, 2024 12:07 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…