భారతీయుడు 2 కన్నా 3 కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నానని కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో అన్న మాటల మీద అభిమానుల్లో పెద్ద చర్చే జరిగింది. అంటే రెండో భాగం కన్నా మూడో భాగంలోనే అసలు సినిమా ఉంటుందనే హింట్ ఇస్తున్నారా అంటూ మూవీ లవర్స్ విశ్లేషణ చేసుకున్నారు. పైగా కాజల్ అగర్వాల్ థర్డ్ పార్ట్ లోనే ఉండటంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఎట్టకేలకు ఇది సిద్దార్థ్ ద్వారా కమల్ హాసన్ కు చేరింది. ఒక ఈవెంట్ లో స్టేజి మీదే దీనికి సంబంధించి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. తానెందుకు ఇండియన్ 3ని హైలైట్ చేయాల్సి వచ్చిందో వివరించారు కమల్.
అమ్మా నాన్నలో ఎవరు ఇష్టమని ఈ ప్రశ్న అడిగినట్టు ఉందని, భారతీయుడు 2 జూలై 12 వస్తోంది కాబట్టి ఆటోమేటిక్ గా తన ఎగ్జైట్ మెంట్ 3 మీదకు వెళ్లిందని చెప్పడమే తన ఉద్దేశం తప్ప మరొకటి కాదని క్లారిటీ ఇచ్చారు. ఇడ్లీ సాంబార్ రసం తిన్న తనకు ఇప్పుడు పాయసం వైపు మనసు లాగుతోందని, భవిష్యత్తులో లైకా దగ్గర సొమ్ములు ఉంటే ఇండియన్ 4 కు కూడా సిద్దమేనని ప్రకటించడం అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంది. మరో సందర్భంలో కమల్ హాసన్ మాట్లాడుతూ సెన్సార్ అధికారులు సైతం ప్రత్యేకంగా ఇండియన్ 2ని మెచ్చుకున్నారని చెప్పడం గమనార్హం.
వీటి సంగతెలా ఉన్నా కమల్ హాసన్ కు భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ చాలా అవసరం. విక్రమ్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో వరసగా సినిమాలు చేస్తున్న లోకనాయకుడు తనకు ఏ రూపంలో స్పీడ్ బ్రేకులు పడేందుకు ఇష్టపడటం లేదు. ఆ మాట కొస్తే విక్రమ్ కన్నా ముందు మొదలైన ఇండియన్ 2 క్రేన్ ప్రమాదం వల్ల ఆగిపోయి తిరిగి గేమ్ ఛేంజర్ తో పాటు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంది. ఆరు నెలల తర్వాత మూడో భాగం రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలున్నాయి. తెలుగు వెర్షన్ ని సైతం గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. రేపు హైదరాబాద్ ఈవెంట్ తో టాలీవుడ్ ప్రమోషన్లు మొదలవుతాయి
This post was last modified on July 6, 2024 5:00 pm
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…