Movie News

కృష్ణుడిగా మహేష్ బాబు – నాగ్ అశ్విన్ రియాక్షన్

కల్కి 2898 ఏడిలో శ్రీకృష్ణుడి మొహం చూపించకుండా కేవలం అర్జున్ దాస్ డబ్బింగ్ తో మేనేజ్ చేసినా సరే ఆ పాత్రకు ఎవరైతే బాగుంటుందనే దాని మీద రకరకాల విశ్లేషణలు జరిగాయి. అత్యధిక శాతం సూపర్ స్టార్ మహేష్ బాబు అయితేనే మంచి ఛాయస్ అవుతాడనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొందరు ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి ఏఐ టెక్నాలజీతో ఫోటోలు కూడా సృష్టించారు. ఏ మాటకా మాటే కానీ కృష్ణుడిగా మహేష్ వాటిలో అదిరిపోయాడు. ఇవాళ కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ ప్రశ్న ఎదురు కావడంతో అయన స్పందన వచ్చేసింది.

మహేష్ బాబు శ్రీకృష్ణుడిగా చాలా బాగుంటాడని అయితే అది కల్కిలో కాకుండా వేరే సినిమాలో అయితే తానూ చూడాలని కోరుకుంటున్నానని చెప్పడంతో కల్కి 2లో వేరే ఆర్టిస్టు ఎవరూ ఉండరనే సంకేతం ఇచ్చినట్టు అయ్యింది.

నిజానికి స్వర్గీయ ఎన్టీఆర్ ని తప్ప కృష్ణుడిగా ఇంకెవరిని చూపించడానికి ఇష్టపడని నిర్మాత అశ్వినిదత్ కోరిక మేరకే ఇలా డిజైన్ చేశారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమనే పాయింట్ మీద ఆయన వైపు నుంచి స్పష్టత రాలేదు. రెండో భాగంలోనూ కృష్ణుడు షాడో రూపంలో కేవలం గొంతు వినిపిస్తాడు తప్పించి రూపం చూసే ఛాన్స్ మాత్రం ఉండదు.

రిలీజైన రెండో వారంలో నాగ్ అశ్విన్ టాలీవుడ్ మీడియాతో ముఖాముఖీ జరపడం విశేషం. ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. పోనీ సక్సెస్ మీట్ ఏమైనా చేస్తారానే దిశగా ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు లేనట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ఏడు వందల కోట్లు దాటేసిన కల్కి 2898 ఏడి ఇంకో వారంలోపే వెయ్యి కోట్లను దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తాను ఫాంటసీని, దేవుళ్ళ శక్తులను, మహాభారతాన్ని నమ్ముతానని చెబుతున్న నాగ్ అశ్విన్ రాబోయే భాగాల్లో మరింత శక్తివంతంగా ఆయా ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దబోతున్నాడు. అవే స్థాయిలో ఉంటాయో ఊహించుకోవడం కష్టమే.

This post was last modified on July 6, 2024 7:05 am

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

24 minutes ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

53 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

1 hour ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

3 hours ago