Movie News

కళ్యాణ్ రామ్ చేస్తోంది పెద్ద రిస్కే..

టాలీవుడ్లో తరచుగా రిస్కీ ప్రాజెక్టులు చేసే హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. కెరీర్ డోలాయమాన స్థితిలో ఉండగా ‘అతనొక్కడే’ లాంటి సాహసోపేత సినిమా చేసి అతను గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. కానీ అతను ఇలా రిస్క్ చేసిన సినిమాల్లో కొన్ని తనను దారుణమైన దెబ్బ కొట్టాయి. హరే రామ్, ఓం త్రీడీ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ రిస్క్‌లు చేసినా అవి క్యాల్కులేటెడ్‌గానే ఉంటున్నాయి.

రెండేళ్ల కిందట అతడి నుంచి వచ్చిన ‘బింబిసార’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. వశిష్ఠ అనే కొత్త దర్శకుడిని నమ్మి పెద్ద బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీస్తే.. బ్లాక్‌బస్టర్ అయింది. కళ్యాణ్‌ రామ్‌కు అన్ని రకాలుగా ఆ చిత్రం ఆనందాన్నిచ్చింది. ఐతే ఇప్పుడు అతను ‘బింబిసార-2’కు రెడీ అయ్యాడు.

కానీ ‘బింబిసార’ తీసిన వశిష్ఠ దీనికి దర్శకుడు కాదు. అతను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘విశ్వంభర’ మీదికి వెళ్లిపోయాడు. దీంతో సరైన దర్శకుడి కోసం వేట సాగించిన కళ్యాణ్ రామ్.. చివరికి అనిల్ పాడూరిని ఎంచుకున్నాడు. కానీ అతడి ట్రాక్ రికార్డు కొంచెం భయపడుతోంది.

దర్శకుడిగా అనిల్ తొలి చిత్రం ‘రొమాంటిక్’ డిజాస్టర్ అయింది. దాని స్క్రిప్ట్ అంతా పూరీ జగన్నాథ్‌దే అయినా.. దర్శకుడిగా అనిల్ గొప్ప పనితనమేమీ చూపించలేదు. పైగా దర్శకుడిగా అలాంటి సినిమాతో అరంగేట్రం చేసిన అనిల్.. ‘బింబిసార-2’ లాంటి యాంబిషియస్ ప్రాజెక్టును ఎలా డీల్ చేస్తాడో అన్న సందేహాలున్నాయి. కాకపోతే ‘మగధీర’ సహా కొన్ని పెద్ద సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేయడం అనిల్‌కు ప్లస్.

‘బింబిసార-2’లో కూడా వీఎఫెక్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. దీని వరకు అనిల్ ఓకే కానీ.. మొత్తంగా సినిమాను ఎలా డీల్ చేస్తాడన్నది ప్రశ్నార్థకం. ఐతే ఒక టీంను పెట్టి స్క్రిప్టు మీద గట్టిగా కసరత్తు చేయడం, సినిమాకు మంచి టెక్నీషియన్లు పని చేస్తుండడంతో అనిల్ పని తేలికవుతుందని.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నందుకుంటామని కళ్యాణ్ రామ్ ఆశాభావంతో ఉన్నాడు.

This post was last modified on July 6, 2024 7:01 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

5 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago