సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) నేరుగా ఓటిటిలో రిలీజైనా ప్రేక్షకుల బ్రహ్మాండమైన మద్దతుతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఏకంగా జాతీయ అవార్డులు తీసుకొచ్చింది. ఎమోషన్స్ ని పండించడంలో, నిరాశలో ఉన్న యువతకు స్ఫూర్తినివ్వడంలో పండించిన భావోద్వేగం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఇదే కాంబోలో పురాననూరు పేరుతో ఒక ప్యాన్ ఇండియా మూవీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, నజ్రియా లాంటి క్రేజీ క్యాస్టింగ్ ని తీసుకుని ప్రకటన నుంచే అంచనాలు పెంచేశారు.
1965లో భారతదేశాన్ని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా సుధా కొంగర ఈ కథను రాసుకున్నారు. అయితే అనౌన్స్ మెంట్ వచ్చి నెలలవుతున్నా కూడా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో దీన్ని తొలుత ప్లాన్ చేసుకున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సుధా కొంగర మాట్లాడుతూ పురాననూరు గురించి ఇప్పటికిప్పుడు ఏం మాట్లాడలేనని, ఉండొచ్చు ఉండకపోవచ్చని నర్మగర్భంగా మాట్లాడ్డంతో డౌట్లు మరింత పెరిగిపోయాయి. సూర్య ఇటీవలే కార్తీక్ సుబ్బరాజ్ తో ఒక సినిమా మొదలుపెట్టాడు.
కాంట్రవర్సీ అవుతుందనే అనుమానంతోనే ఈ ప్రాజెక్టుని సూర్య, నిర్మాతలు పెండింగ్ లో పెట్టారని చెన్నై టాక్. కారణం ఏదైనా ఆకాశం నీ హద్దురా కాంబోలో మరో గొప్ప చిత్రం చూడబోతున్నామనే అభిమానులు మాత్రం నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం సుధా కొంగర శివ కార్తికేయన్ తో ఒక మూవీ ప్లాన్ చేయబోతున్నారని ఇంకో టాక్. అది పురాననూరా లేక వేరే కొత్త కథా అనేది తెలియాల్సి ఉంది. ఈవిడ దర్శకత్వంలో రూపొందిన ఆకాశం నీ హద్దురా రీమేక్ సర్ఫిరా వచ్చే శుక్రవారం జూలై 12 విడుదల కానుంది. అక్షయ్ కుమార్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. సూర్యని మరిపిస్తాడో లేదో చూడాలి.
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…