‘కల్కి 2898 ఏడీ’ సినిమాను థియేటర్లలో చూసిన వాళ్లు చాలామందికి కలిగిన సందేహం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరో ప్రభాసా, అమితాబ్ బచ్చనా అని. ఎందుకంటే సినిమాలో అమితాబ్ పోషించిన అశ్వథ్థామ పాత్ర మంచి కోసం పోరాడితే.. ప్రభాస్ పాత్ర చెడు వైపు నిలబడుతుంది. ఐతే హీరో పాత్రలు ముందు నెగెటివ్ షేడ్స్‌తో ఉండి తర్వాత పాజిటివ్‌గా మారడం మామూలే.
‘కల్కి’లో కూడా ప్రభాస్ పాత్ర ఇలాగే మారేలా కనిపించింది కానీ.. ఫస్ట్ పార్ట్ వరకు అయితే నెగెటివ్ షేడ్స్‌తోనే కనిపించింది. దీంతో ఈ సినిమాకు అసలైన హీరో అమితాబే అన్న అభిప్రాయం కలిగింది. ఇప్పుడు నిర్మాత అశ్వినీదత్ సైతం ఇదే మాట అనడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘కల్కి’ సినిమాకు ఫస్ట్ హీరో అమితాబే అన్నారు. అంతే కాక ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ఎవరు అని అడిగినా.. అమితాబ్ అనే చెప్పారు దత్.
అశ్వినీదత్ ఇలా అన్నారని ప్రభాస్ ఫ్యాన్సేమీ ఫీలయిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అమితాబ్ గురించి ప్రభాస్ స్వయంగా అన్న మాటలను కూడా దత్ ఈ ఇంటర్వ్యూలో ఉటంకించారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో అమితాబే అని ప్రభాసే అన్నాడని.. అతడి అభిప్రాయాన్ని తామంతా గౌరవించాలని అనుకున్నామని అశ్వినీదత్ అన్నారు. అమితాబ్‌ను అలా గౌరవిస్తేనే తమకు గౌరవం దక్కుతుందని ప్రభాస్ వ్యాఖ్యానించినట్లు కూడా దత్ వెల్లడించారు.
అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించడం పట్ల ప్రభాస్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడని.. కల నెరవేరినట్లుగా భావించాడని దత్ తెలిపారు. ఇదిలా ఉండగా ‘కల్కి-2’కు సంబంధించి సగానికి పైనే పూర్తయిందని.. ఆ చిత్రం 2025 వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అశ్వినీదత్ చూచాయిగా చెప్పారు.
This post was last modified on July 4, 2024 2:30 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…