Movie News

అర్జున్ సర్కార్ కోసం విలన్ వేట

కెరీర్లో మొదటిసారి ఒక సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించడం నానికి సరిపోదా శనివారం విషయంలోనే జరిగింది. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇదే డివివి బ్యానర్ లో దర్శకుడు సుజిత్ తో అఫీషియల్ గా ప్లాన్ చేసుకున్న మూవీని నాని పెండింగ్ లో ఉంచేశాక తర్వాత చేయబోయే చిత్రాల వరసలో మార్పులు వచ్చేశాయి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీని ఆల్రెడీ ఓకే చేయగా దానికి సంబంధించిన పీ ప్రొడక్షన్, సెట్ పనులు జరుగుతున్నాయి.

ఇంకో నాలుగైదు నెలల తర్వాతే షూటింగ్ ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొనడంతో దాని కన్నా ముందు హిట్ 3 ది థర్డ్ కేస్ తెరకెక్కించేందుకు ప్లానింగ్ అవుతున్నట్టు సమాచారం. దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ ని దాదాపు కొలిక్కి తెచ్చాడట. అడవి శేష్ హీరోగా రూపొందిన హిట్ 2 ది సెకండ్ కేస్ చివర్లో నాని అర్జున్ సర్కార్ ఐపీఎస్, మెంటల్ మాస్ పోలీస్ గా మూడో భాగంలో కనిపిస్తాడని ముంచే హింట్ ఇచ్చారు. అప్పటి నుంచే అభిమానులకు దాని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. సైంధవ్ ఫలితం నిరాశపరచడంతో శైలేష్ తిరిగి తన పాత స్కూలుకు వచ్చేశాడు.

ఇప్పుడు అర్జున్ సర్కార్ ని ధీటుగా సవాల్ చేసే విలన్ కావాలి. ఇప్పుడా వేటనే కొనసాగుతోంది. బాలీవుడ్ యాక్టర్లు కాకుండా ఈసారి సౌత్ నుంచే తీసుకోవాలని శైలేష్ ప్లాన్. దగ్గుబాటి రానాకు స్టోరీ వినిపించారని కాకపోతే ఇంకా ఎలాంటి సంకేతం రాలేదని తెలిసింది. హిట్ 3 విలన్ చాలా క్రూరంగా ఒళ్ళు గగుర్పొడిచే విధంగా హత్యలు చేసే వాడిగా చూపించబోతున్నారట. అంత ఇంటెన్స్ యాక్టర్ ఉంటే తప్ప దీన్ని పండించడం కష్టం. రానా, ఉపేంద్ర, ఇటీవలే మహారాజలో మెప్పించిన అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు పర్ఫెక్ట్ ఛాయస్ అవుతారు. మరి శైలేష్ కొలను అన్వేషణ ఎవరి దగ్గర ఆగుతుందో చూడాలి.

This post was last modified on July 4, 2024 11:34 am

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago