కల్కి 2898 ఏడి ప్రభంజనాన్ని ముందే ఊహించిన ఇతర నిర్మాతలు దానికి ముందు వెనుక తమ రిలీజులు లేకుండా జాగ్రత్త పడటంతో ఈ శుక్రవారం జూలై 5 ఎలాంటి కొత్త సినిమాలకు ఛాన్స్ లేకుండా పోయింది. 14 టైటిల్ తో ఒక స్ట్రెయిట్ మూవీ రిలీజవుతోంది కానీ దానికి ఓపెనింగ్స్ దక్కడం కూడా డౌటే. అసాధారణమైన టాక్ వస్తే తప్ప నిలబడదు. ఇక బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కిల్ అనే యాక్షన్ థ్రిల్లర్ ని విడుదలవుతున్నా బజ్ లేదు. నాలుగైదు రోజుల ముందే క్రిటిక్స్ కి స్పెషల్ షోలు వేశారు కానీ వాళ్ళ పాజిటివ్ ట్వీట్లు ఓపెనింగ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించేలా లేవు.
కల్కి చూసేసినవాళ్లకు థియేటర్ పరంగా ఆప్షన్ లేదు కానీ ఒక వెబ్ సిరీస్ మాత్రం విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదే మీర్జాపూర్ సీజన్ 3. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వయొలెంట్ డ్రామాకి భారీ అభిమానులున్నారు. మొదటి రెండు భాగాలూ బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకున్నాయి. హింస, బూతులు హద్దులు మీరు ఉన్నాయనే కామెంట్స్ ఎన్ని వచ్చినప్పటికీ మేకర్స్ ఇందులో డోస్ ని అంతకంతా పెంచుకుంటూ పోతున్నారు. దీంతో యూత్ లో ఒకరకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇక్కడో సంగతి గుర్తు చేసుకోవాలి. యానిమల్ సమయంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ దాని మీద విమర్శలు చేసినప్పుడు సందీప్ వంగా బదులు చెబుతూ ముందు మీ అబ్బాయి నిర్మాతగా వచ్చిన మీర్జాపూర్ చూడమని కౌంటర్లు వేయడం బాగా హైలైట్ అయ్యింది. అంత వయొలెంట్ కంటెంట్ ఇందులో ఉంది మరి. ఒక ఊరిలో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న కుటుంబంలో జరిగే రాజకీయాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. సో కల్కిని పూర్తి చేసి కొత్త ఎంటర్ టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మీర్జాపూర్ లో అడుగు పెట్టడమే ప్రధాన ఆప్షన్ గా ఉండొచ్చు.
This post was last modified on July 3, 2024 5:59 pm
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు,…
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పథకాల కోసం ప్రభుత్వ నిధులను…
భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి…
ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ,…
వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…