ఆచార్య షూటింగ్ నవంబర్ నుంచి మొదలు పెట్టాలని కొరటాల శివ భావిస్తోండగా, దానికంటే ముందుగా ఒక రెండు, మూడు రోజుల ట్రయల్ షూట్ చేయమని చిరంజీవి సూచించారట. కరోనా బారిన పడకుండా షూటింగ్ చేయడం కుదురుతుందా లేదా అనేది తెలుసుకోవాలని చిరంజీవి ఇలా చెప్పారట. ట్రయల్ షూట్ చేసిన తర్వాత సెట్లో వున్న వాళ్లకు కరోనా టెస్టులు చేయించాలని, వారికి ఏ సమస్యా లేదని తెలిస్తే కొద్ది రోజులు ఆగి రెగ్యులర్ షూటింగ్ చేసుకోవచ్చునని అంటున్నారట.
యువ హీరోలతో పోలిస్తే కరోనా భయం చిరంజీవికి ఎక్కువ వుండడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అరవయ్యేళ్లు పైబడిన వాళ్లకు ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. అందుకే చిరంజీవితో పాటు వెంకటేష్, బాలకృష్ణ కూడా షూటింగ్ మొదలు పెట్టడానికి సుముఖంగా లేరు. నాగార్జున మాత్రమే ముందుగా ధైర్యం చేసి బిగ్‍బాస్‍తో పాటు వైల్డ్ డాగ్ కూడా మొదలు పెట్టేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్ లేకుండానే ‘వకీల్ సాబ్’ షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు.
పవన్ అవసరం లేని భాగాలను ముందుగా పూర్తి చేసేసి నవంబర్ నుంచి పవన్‍పై సీన్స్ తీస్తారు. పవన్‍కళ్యాణ్‍కి పెడదామని అనుకున్న ఫ్లాష్‍బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయించుకోలేదని సమాచారం.
This post was last modified on September 22, 2020 11:24 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…