నాని హీరో, దిల్ రాజు నిర్మాత, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడంటే ఆ సినిమా బాగోదని ఎవరు అనుకుంటారు? అందులోను నాని ఇరవై అయిదవ చిత్రం కనుక ఖచ్చితంగా స్పెషల్‍గా వుంటుందని, ఇంత పెద్ద సినిమాను ఓటిటి ద్వారా విడుదల చేస్తే అమెజాన్ ప్రైమ్ యూజర్ డాటాబేస్ అమాంతం పెరిగిపోతుందని భావించి ‘వి’ రైట్స్ను అమెజాన్ భారీ రేటిచ్చి సొంతం చేసుకుంది. థియేట్రికల్‍గా విడుదల చేసి, సినిమా హిట్టయితే ఎంత లాభం వస్తుందో అదే స్థాయి లాభం కనిపించే సరికి దిల్ రాజు కూడా ‘వి’ డిజిటల్ రిలీజ్‍కి ఓకే చెప్పేసాడు.
అయితే అమెజాన్ అనుకున్నది ఒకటి అయితే, జరిగింది మరొకటి. వి సినిమా బాలేదనే టాక్ మొదటి ఆటతోనే మొదలైపోవడంతో ఈ సినిమాకి ఆశించిన స్పందన రాలేదు. ఇక డిజిటల్ రిలీజ్ అంటే పైరసీ బెడద వుండనే వుంటుంది. సినిమా బాగుందనే టాక్ వస్తే ఖచ్చితంగా చాలా మంది సభ్యత్వం తీసుకుని వుండేవాళ్లు. ఏ విధమయిన లాభం జరగకపోవడంతో ఇలాంటి సబ్‍స్టాండర్డ్ ప్రోడక్ట్ అంత రేటుకి అమ్మడం తగదని, భవిష్యత్తులో సంబంధాలు మెరుగ్గా వుండాలంటే కొంత మొత్తం తిరిగి ఇవ్వాలని అమెజాన్ నుంచి డిమాండ్ చేస్తున్నారట.
దిల్ రాజు నుంచి ఇంకా స్పందన ఏదీ రాలేదు కానీ ఒత్తిడి పెరిగితే మాత్రం తప్పక కొంత వెనక్కు ఇవ్వాల్సి వుంటుంది. డిజిటల్ రిలీజ్ చేస్తే ఫ్లాపయినపుడు బయ్యర్ల మాదిరిగా ఒత్తిళ్లు వుండవనుకునే నిర్మాతలకు ఇది కొత్త షాక్ అనుకోవచ్చు.
This post was last modified on September 23, 2020 12:24 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…