Movie News

ఇది ప్రభాస్‌కే సాధ్యం

‘బాహుబలి-2’ విడుదలై ఏడేళ్లు దాటిపోయింది. ఈ ఏడేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. కానీ వాటిలో ఏవీ ‘బాహుబలి-2’ ఓవరాల్ వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టలేకపోయాయి.

ఓపెనింగ్స్ వరకు కొన్ని ఏరియాల్లో పైచేయి సాధించినా ఓవరాల్ వసూళ్లలో ‘బాహుబలి-2’ను ఏ చిత్రం టచ్ చేయలేకపోతోంది. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ప్రభాస్‌కు కూడా ‘బాహుబలి-2’ రికార్డులను బద్దలు కొట్టడం సాధ్యం కాలేదు.

కానీ అతను ‘బాహుబలి’ తర్వాత రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న అప్‌కమింగ్ డైరెక్టర్లతోనే పని చేశాడు. వాళ్లతోనే బాక్సాఫీస్ దగ్గర ప్రతి సినిమాకూ భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగాడు.

వరుసగా మూడు డిజాస్టర్లు పడ్డా కూడా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా చెక్కు చెదరకపోవడం విశేషం. గత ఏడాది ‘సలార్’తో, ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’తో అతను సాగిస్తున్న వసూళ్ల ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే.

‘కల్కి’కి కొంచెం డివైడ్ టాక్ వచ్చినా తొలి వీకెండ్లో సంచలన వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.500 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి నాలుగు రోజుల తొలి వీకెండ్లో. సినిమాలో ఎన్ని ఆకర్షణలు ఉన్నా.. మెజారిటీ జనాలను థియేటర్ల వైపు రప్పిస్తోంది ప్రభాస్ స్టార్ పవర్ అనడంలో సందేహం లేదు.

యుఎస్‌లో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు సంచలనమే. వీకెండ్లోనే 10 మిలియన్ డాలర్లు కొల్లగొట్టేసింది. ‘బాహుబలి-2’ కంటే వేగంగా ఈ చిత్రం యుఎస్‌లో 10 మిలియన్ డాలర్ల క్లబ్బులో అడుగు పెట్టడం అసామాన్య విషయం. అంతే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యుఎస్‌లో రెండు 10 మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్నది ఒక్క ప్రభాస్‌కు మాత్రమే.

దర్శకుల్లో రాజమౌళి ఈ ఘనత సాధించాడు. ‘కల్కి’ ప్రభంజనం ఇంతటితో ఆగేలా లేదు. యుఎస్‌లో ‘బాహుబలి-2’ రికార్డులకు ఈ చిత్రం చేరువగా వెళ్లేలా ఉంది. ఓవరాల్ వసూళ్లు కూడా రూ.800 దాకా ఉంటాయని అంచనా

This post was last modified on July 1, 2024 9:51 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago