భారతీయ సినీ చరిత్రలోనే అతి పెద్ద విజయాలు సాధించి.. ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన చిత్రాల్లో ‘రోబో’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ఇండియాలో ఎన్నో విజువల్ వండర్స్ వచ్చాయి కానీ.. అంతకు ఐదేళ్ల ముందే ‘రోబో’తో ఔరా అనిపించాడు శంకర్.
ఈ చిత్రం రిలీజైంది 2010లో కానీ అంతకు పదేళ్ల ముందే శంకర్ ఈ చిత్రం తీయాలనుకున్నాడు. కమల్ హాసన్‌ను హీరోగా, ప్రీతి జింతాను కథానాయికగా అనుకుని.. వాళ్లిద్దరి మీద లుక్ టెస్ట్ కూడా చేశాడు.
ఆ ఫోటోలు కూడా తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఐతే తాను ఈ చిత్రం చేయకపోవడానికి కారణమేంటో ఓ ఇంటర్వ్యూలో కమల్ వెల్లడించాడు. అంతే కాక తనను ‘2.0’లో అక్షయ్ కుమార్ చేసిన విలన్ పాత్రకు కూడా శంకర్ అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు కమల్.
‘‘ఐ రోబో అనే నవల ఆధారంగా సినిమా చేయాలని నేను, శంకర్, రచయిత సుజాత అనుకున్నాం. 90ల్లోనే ఆ చర్చ జరిగింది. నా పాత్రకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. సినీ పరిశ్రమలో బడ్జెట్లు, రెమ్యూనరేషన్లు.. ఇలా ఎన్నో లెక్కలుంటాయి.
అప్పటి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా చేయకపోవడం మంచిది అనిపించింది. అందుకే నేను వెనుకంజ వేశాను. కానీ నా మిత్రుడు శంకర్ మాత్రం పట్టుదలతో ఆ సినిమాను కొన్నేళ్ల తర్వాత తెరకెక్కించాడు. అది ఘనవిజయం సాధించింది. తర్వాత నన్ను ‘2.0’ కోసం శంకర్ అడిగాడు.
కానీ ఇంకా కొన్నేళ్ల పాటు నన్ను నేను హీరో పాత్రలోనే చూసుకోవాలనుకుంటున్నానని, విలన్ పాత్ర చేయనని చెప్పా’’ అని కమల్ నవ్వుతూ చెప్పాడు. కమల్‌కూ మిత్రుడే అయిన రజినీతో ‘రోబో’ చేసిన శంకర్ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే.
This post was last modified on June 30, 2024 6:03 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…