ఈ వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే తెచ్చుకుంది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్సే ఒక రేంజిలో జరిగాయి. తొలి రోజు టాక్ కొంచెం డివైడ్‌గా ఉన్నప్పటికీ వసూళ్లేమీ తక్కుగా రాలేదు. వీకెండ్ మొత్తానికి చాలా వరకు బుకింగ్స్ జరిగిపోవడంతో ఏ రోజుకు ఆ రోజు మంచి వసూళ్లు వస్తున్నాయి. రెండో రోజైన శుక్రవారాన్ని మించి మూడో రోజైన శనివారం ఎక్కువ వసూళ్లు రావడం విశేషం. ఆదివారం కూడా అదే స్థాయిలో వసూళ్లు ఉండబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
మేకర్స్ ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. నిర్మాతలు ప్రకటించే నంబర్స్ కొంచెం ఎగ్జాజరేటెడ్ అనిపించినా.. ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్న మాట మాత్రం వాస్తవం.
ఐతే ‘కల్కి’ సినిమాకు టికెట్ల రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ప్రేక్షకులు కొంత వెనుకంజ వేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్సుల్లో రూ.100 రేటు పెంచగా.. ఏపీలో వరుసగా రూ.75, 125 మేర రేట్లు పెరిగాయి.
ఇక తెలంగాణలో అర్లీ మార్నింగ్ షోలకైతే ఏకంగా రూ.200 రేటు పెంచారు. ఐతే ఇంత పెద్ద సినిమాకు, తొలి వీకెండ్లో ఈ మాత్రం రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడంలో తప్పేమీ లేదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కానీ సినిమాకు కొంచెం డివైడ్ టాక్ ఉండడం వల్ల అంత రేటు పెట్టి సినిమా చూసేందుకు ప్రేక్షకులు కొంచెం వెనుకంజ వేస్తున్నారనే చర్చ ఉంది.
సినిమాకు ఉన్న హైప్‌కి వీకెండ్ వరకు ఢోకా లేకపోయినా.. వీక్ డేస్‌లో ఈ రేట్లతో సినిమా బాగా నడవడం కష్టం అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రేట్లు తగ్గించి మరింతగా ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం నుంచే రేట్లు తగ్గొచ్చు. లేదా ఆ రోజు రెస్పాన్స్ చూసి ధరలు తగ్గించే అవకాశముంది.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…