‘కల్కి 2898 ఏడీ’ లాంటి ఎపిక్ మూవీకి పని చేసిన సాంకేతిక నిపుణుల విషయంలో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇలాంటి భారీ చిత్రాలకు పెద్ద స్థాయి ఉన్న, పేరుపడ్డ టెక్నీషియన్లనే పెట్టుకుంటారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం భిన్నమైన దారిలో నడిచాడు. దేశంలో ఎందరో టాప్ సినిమాటోగ్రాఫర్లు ఉండగా.. సెర్బియాకు చెందిన జార్జ్ స్టాజిల్జ్‌కోవిచ్ అనే ఛాయాగ్రాహకుడిని ఎంపిక చేసుకున్నాడు. ఐతే సినిమా ఔట్ పుట్ చూస్తే అతను గొప్ప పనితనం చూపించాడనే అభిప్రాయమే కలిగింది.
ఇక సంగీత దర్శకుడి విషయానికి వస్తే.. ముందు మిక్కీ జే మేయర్‌ను ఎంపిక చేసుకున్న నాగ్ అశ్విన్.. తర్వాత అతడి స్థానంలోకి సంతోష్ నారాయణన్‌ను తీసుకొచ్చాడు. తమిళంలో సంతోష్‌కు మంచి పేరే ఉంది కానీ.. ఈ స్థాయి భారీ చిత్రానికి న్యాయం చేయగలడా అన్న సందేహాలు కలిగాయి.
‘కల్కి’ సినిమా చూసిన ప్రేక్షకులు సంగీత దర్శకుడి పనితనం విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో పాటలు పూర్తిగా తేలిపోయాయి. రిలీజ్ ముంగిట అసలు పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడం.. జనాల్లోకి తీసుకెళ్లడం లాంటి ప్రయత్నాలే టీం చేయలేదు. సినిమాలో పాటలకు ప్రాధాన్యం లేనట్లే వ్యవహరించారు. భైరవ యాంథెమ్ ఒకటి రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. దానికి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాలో అసలా పాటే లేదు. చిన్న బిట్ మాత్రం వాడారు. అది కాక ఉన్న మూణ్నాలుగు పాటల్లో ఏదీ రిజిస్టర్ కాలేదు. ఇలాంటి భారీ చిత్రాల్లో పాటల గురించి ఎవరు పట్టించుకుంటారని అనుకోవడానికి వీల్లేదు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలకు పాటలు ఎంత ప్లస్ అయ్యాయో చెప్పాల్సిన పని లేదు. రిలీజ్ ముంగిటే సినిమాకు హైప్ రావడంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. కానీ నాగి మాత్రం పాటల్ని లైట్ తీసుకున్నాడు. సంతోష్ కూడా సరైన పాటలు ఇవ్వలేదు. ఐతే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం సంతోష్ మంచి పనితనమే చూపించాడు. మరీ కీరవాణి రేంజ్ ఔట్ పుట్ ఇవ్వలేదు కానీ.. ఈ సినిమాకు న్యాయం చేశాడు. పాటల విషయంలో మైనస్ అయినా.. స్కోర్ వరకు అతను సినిమాకు ప్లస్ అయ్యాడు.
This post was last modified on June 29, 2024 2:29 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…