కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారతీయుడు 2 వచ్చే నెల 12 విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర కావడంతో టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. కల్కి 2898 ఏడి తాకిడి ఎక్కువగా ఉన్నా అప్పటికంతా రెండు వారాలు గడిచిపోయి ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ కి ఎలాంటి లోటు ఉండదనే ధీమా నిర్మాతల్లో కనిపిస్తోంది. కేవలం ఇండియా వైడ్ పబ్లిసిటీకి పరిమితం కాకుండా కమల్, శంకర్, సిద్దార్థ్ లు ఏకంగా విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో కమల్ హాసన్ భారతీయుడు 3కి సంబంధించిన ఒక కీలకమైన ట్విస్టుని బయటికి చెప్పేశారు.
దాని ప్రకారం భారతీయుడు 3లో సేనాపతి తండ్రి వస్తాడు. అంటే మొదటి భాగంలో చనిపోయిన చందూ తాతయ్య. స్వతంత్రం కోసం చేసిన యుద్ధంలో సేనాపతి పాల్గొనే సమయానికి వయసు మళ్ళిన ఒక పోరాట యోధుడు అయన నాన్నగా ఇంకో వైపు బ్రిటిషర్లతో తిరుగుబాటు చేస్తాడన్న మాట. ఇది నిజంగా ఊహించని మలుపు. అసలు ఇప్పటికే భారతీయుడు వయసు వంద సంవత్సరాలు దాటిపోతే ఫైట్లు ఎలా చేస్తాడనే డిబేట్ అభిమానుల మధ్య జరుగుతూ ఉండగా ఇప్పుడు కొత్తగా ఇండియన్ 3లో ఇంకో కమల్ హాసన్ ఉంటాడని చెప్పడం ఊహించని పరిణామం. ఇంటరెస్టింగ్ గా ఉంది.
ఈ లెక్కన కాజల్ అగర్వాల్ జోడిగా కనిపించేది సేనాపతి తండ్రితోనే. ఈ ఫ్లాష్ బ్యాక్ కీలకం కాబోతోంది. బజ్ విషయంలో వెనుకబడినట్టు అనిపిస్తున్న భారతీయుడు 2కి ట్రైలర్ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. కానీ టీమ్ మాత్రం అందులో ఏం చూపించలేదని, స్క్రీన్ మీద కమల్ చేయబోయే విధ్వంసానికి థియేటర్లు ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. జూలై నెలలో తెలుగు తమిళంలో ఇదే చెప్పుకోదగ్గ రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు లైకా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇంకో వారంలో బిజినెస్ క్లోజ్ చేసేస్తారు.
This post was last modified on June 29, 2024 2:17 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…