సోషల్ మీడియాలో తెలుగు కుర్రాళ్లు ఫ్యాన్ వార్స్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్ ఎంచుకుంటూ ఉంటారు. కొన్ని టాపిక్స్ చూసి.. వీటి మీద గొడవ పడతారా అని ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిదే ఇప్పుడు ఒక టాపిక్ తెలుగు నెటిజన్లను బాగా ఎంగేజ్ చేస్తోంది. నిన్ననే ప్రభాస్-నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది ప్రధానంగా సైన్స్ ఫిక్షన్ మూవీ అయినా.. అందులోకి మన పురాణ పాత్రలను కూడా తెలివిగా జొప్పించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మహాభారత కాలం నాటి అశ్వథ్థాముడు ఇంకా బతికే ఉన్నట్లు చూపిస్తూ.. ప్రభాస్ చేసిన భైరవ పాత్ర కర్ణుడి అంశలో పుట్టినట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మహాభారత కథను అక్కడక్కడా టచ్ చేస్తూ వచ్చిన నాగ్ అశ్విన్.. చివర్లో కర్ణుడి పాత్రకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు.
ఐతే ఇక్కడ అర్జునుడి పాత్రను తగ్గించి కర్ణుడికి ఎలివేషన్ చాలామందికి నచ్చలేదు. హీరో ఏ పాత్ర చేస్తే దాన్ని సినిమాల్లో ఎలివేట్ చేయడం మామూలే. ఈ చిత్రంలో కూడా అదే జరిగింది. ఐతే కర్ణుడు నిజంగా సినిమాలో పేర్కొన్నంత గొప్ప వీరుడు కాదని.. అర్జునుడి ముందు అతను నిలవలేడని సోషల్ మీడియాలో ఒక వర్గం యుద్ధానికి దిగింది. సినిమా అవసరాల కోసం చరిత్రను మార్చడం తప్పని ఆ వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలోనే అర్జునుడి శక్తి సామర్థ్యాలు, అతను చేసిన యుద్ధాలు, తన దగ్గరున్న ఆయుధాల గురించి ఏకరువు పెడుతున్నారు. కర్ణుడు చేసిన తప్పిదాలు, మోసాల గురించి.. అలాగే అతను యుద్ధం నుంచి పారిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఐతే కర్ణుడి గొప్పదనాన్ని కొనియాడుతూ.. అర్జునుడిని తక్కువ చేస్తూ పోస్టులు పెడుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇలా నిన్నట్నుంచి నడుస్తున్న ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఐతే ఎప్పుడూ ఎంచుకునే టాపిక్స్‌తో పోలిస్తే పురాణాల మీద విజ్ఞానాన్ని పెంచేలా నడుస్తున్న ఈ టాపిక్ కొంత నమయమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 29, 2024 10:06 am
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…