Movie News

ప్రభాస్ హీరోనా విలనా?

కొన్ని రోజుల నుంచి ఇండియన్ సోషల్ మీడియాను ‘కల్కి 2898 ఏడీ’ ఫీవర్ చుట్టేసింది. ఇక నిన్న అర్ధరాత్రి నుంచి అయితే వేరే ఏ టాపిక్ కనిపించడం లేదు సోషల్ మీడియాలో. ‘బాహుబలి’ తర్వాత ఈ స్థాయిలో హైప్ తెచ్చుకుని, ఇంతగా చర్చనీయాంశం అయిన సినిమా మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎటు చూసినా కల్కి సినిమా చర్చలే కనిపిస్తున్నాయి సోషల్ మీడియా అంతటా. ‘బాహుబలి’ తర్వాత బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా ‘సలార్’ మాత్రమే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆనందాన్నివ్వగా.. ఇప్పుడు ‘కల్కి’ సైతం వారికి సంతృప్తినిచ్చేలాగే కనిపిస్తోంది. భారీ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ చిత్రం.. వీకెండ్ అంతా వసూళ్ల మోత మోగించేలాగే ఉంది. కొంచెం మిక్స్డ్‌ టాక్ ఉన్నప్పటికీ.. తర్వాత కూడా సినిమా బలంగానే నిలబడుతుంది అనిపిస్తోంది.

సినిమా ఎలా ఉందనే విషయంలో కొంత డిజప్పాయింట్ కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్‌గా ఇది మస్ట్ వాచ్ మూవీ అనే చాలామంది అంటున్నారు. సినిమాలో పాత్రల విషయానికి వస్తే.. ప్రభాస్ అసలు హీరోనా విలనా అనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. తన పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని.. సరదాగా ఉంటుందని ప్రభాస్ ముందే చెప్పేశాడు. సినిమా చూస్తే కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉండడం కాదు, మొత్తం నెగెటివ్‌గానే కనిపించింది. ‘కల్కి’ కథను సగంలో ఆపగా.. ఈ సగంలో అమితాబ్ బచ్చన్ పాత్రే హీరోలా కనిపించింది.

ఆయన మంచి వైపు నిలబడి కల్కి రక్షణ కోసం పోరాడితే.. ప్రభాస్ సినిమా అంతా చెడు వైపు నిలబడి అమితాబ్ ప్రయత్నానికి అడ్డు తగులుతూ ఉంటాడు. హీరో ముందు చెడ్డవాడిగా ఉండి ఏదో ఒక దశలో పరివర్తన చెంది అంతిమంగా మంచి కోసం పోరాడే సినిమాలు చాలా చూశాం. ఐతే ‘కల్కి’ కథ మధ్యలో ఉండగా ఇప్పటి వరకు అయితే ప్రభాస్‌లో అలాంటి పరివర్తన ఏదీ కనిపించదు. సినిమా చివర్లో అతడిని వేరే అవతారం పూని కొన్ని నిమిషాలు దుష్ట సంహారం చేస్తాడు. కానీ ఒరిజినల్‌గా ఆ పాత్రలో ఇంకా మార్పు రానట్లే. సెకండ్ పార్ట్‌లో పాత్ర పరివర్తన చెంది హీరోగా రూపాంతరం చెందడం చూస్తాం అనుకోవచ్చు.

This post was last modified on June 28, 2024 6:04 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

టాలీవుడ్ అవకాశాలతో కెజిఎఫ్ హీరోయిన్

మాములుగా కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటిస్తే అవకాశాలు క్యూ కట్టాలి. మార్కెట్ పెరగాలి. కానీ హీరోయిన్ శ్రీనిధి…

2 hours ago

జీతం ఇస్తామన్నారు.. తీసుకోలేదు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.4 వేలకు పెంచిన పింఛన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా జులై 1న పంపిణీ చేయడం మొదలుపెట్టింది.…

2 hours ago

1995నాటి బాబును చూస్తారు..బాబుగారి వార్నింగ్

జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించిన…

4 hours ago

ప్రభాస్ సునామీకి అజయ్ దేవగన్ ఆందోళన

తెలుగులో రికార్డులు సృష్టించడంలో ఆశ్చర్యం లేదు కానీ కల్కి 2898 ఏడి బాలీవుడ్ లోనూ భారీ వసూళ్లు నమోదు చేయడం…

4 hours ago

జగన్ పై చంద్రబాబు, లోకేష్ ర్యాగింగ్..వైరల్

పరదాల ముఖ్యమంత్రి అంటూ ఏపీ మాజీ సీఎం జగన్ పై గత ప్రభుత్వంలో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ…

5 hours ago

యాస్కిన్ మీద సోలో మూవీ సాధ్యమేనా

కల్కి 2898 ఒక భాగం కాదనే సంగతి అటు సినిమాలో, ఇటు నిర్మాత అశ్వినిదత్ ఇంటర్వ్యూలో స్పష్టంగా అర్థమైపోయింది. అయితే…

6 hours ago