కల్కి 2898 ఏడీ లాంటి భారీ సినిమాలు రిలీజవుతుంటే.. సెలబ్రెటీలు కూడా సామాన్య ప్రేక్షకుల్లా మారిపోయి ఎంతో ఎగ్జైట్మెంట్‌తో థియేటర్లకు వెళ్లిపోతారనడంలో సందేహం లేదు. ఈ రోజు టాలీవుడ్లో యాక్టివిటీస్ చాాలా వరకు ఆగిపోయి సెలబ్రెటీలందరూ కూడా ‘కల్కి’ సినిమాలో మునిగిపోయిన సంకేతాలే కనిపిస్తున్నాయి. ఐతే అలా సినిమా చూసిన వాళ్లలో ఒక వ్యక్తి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
అతనే.. అకీరా నందన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన అకీరా.. గురువారం ‘రెబల్స్’లో ఒకడిగా మారిపోవడం విశేషం. ఈ మధ్య తరచుగా మీడియా దృష్టిలో పడుతున్న అకీరా.. ‘కల్కి’ రిలీజ్ రోజు తెల్లవారుజామునే ఒక మల్టీప్లెక్సుకి వచ్చి ఈ సినిమా చూశాడు. అతడి వెంట తల్లి రేణు దేశాయ్ సహా కొందరు సన్నిహితులు ఉన్నారు.
విశేషం ఏంటంటే.. అకీరా ఈ సినిమాకు మామూలుగా రాలేదు. ‘కల్కి’ మెర్చండైజ్ వేసుకునే వచ్చాడు. తన టీషర్ట్ మీద కల్కి పేరు కనిపించింది. చుట్టూ ఉన్న వాళ్లు కూడా ‘కల్కి’ టీషర్టులు వేశారు. పవన్ కళ్యాణ్ తనయుడు ఇలా ‘కల్కి’ టీషర్ట్ తొడుక్కుని వచ్చేసరికి మీడియాలో బాగా హైలైట్ అయ్యాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అతణ్ని ఓన్ చేసుకుని.. అకీరా కూడా మన రెబల్స్‌లో ఒకడే అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
అకీరాకు మ్యూజిక్‌తో పాటు సినిమాల మీద కూడా బాగానే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం హీరో కావడానికి ప్రిపరేషన్లో ఉన్నాడని భావిస్తున్నారు. అందుకే తనను మీడియాకు, సోషల్ మీడియాకు అలవాటు చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు, ఫలితాల టైంలో తండ్రితో కనిపించిన అకీరా.. ఇప్పుడు ‘కల్కి’ సినిమా చూసేందుకు వచ్చి అందరి దృష్టిలో పడ్డాడు.
This post was last modified on June 28, 2024 12:16 am
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…