ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్లా సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రతి థియేటర్‌లో డార్లింగ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ అదిరిపోయిందని, క్లైమాక్స్ అయితే మతిపోయిందని అంటున్నారు. తెలుగు సినిమాను హాలీవుడ్ లెవల్‌లో నాగ్ అశ్విన్ నిలబెట్టాడు అన్న టాక్ వినిపిస్తుంది.
అన్నీ చోట్ల నుంచి పాజిటివ్ గా స్పందన వస్తుండడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో అరిపోయి, చిరిగిపోయిన చెప్పును పోస్ట్ చేయడం విశేషం. చాలా కాలంగా ఇవి కొనసాగుతున్నాయి అంటూ నాగ్ అశ్విన్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
దాదాపు సినిమా ప్రారంభమైనప్పటి నుంచి నాలుగేళ్లుగా నాగ్ అశ్విన్ ఈ చెప్పులనే వాడుతున్నట్లుగా సమాచారం. అందుకే వాటిని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్.. పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటించడం విశేషం.
This post was last modified on June 27, 2024 5:14 pm
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…