మరికొద్ది గంటల్లో ప్రీమియర్లు మొదలుకాబోతున్న కల్కి 2898 ఏడి ఎదురు చూపులు నిమిషాలను సైతం యుగాలుగా మార్చేస్తున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద అతి పెద్ద విజువల్ వండర్ చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్న వేళ కొన్ని ఆసక్తికరమైన లీక్స్ కొన్ని విషయాల్లో సంసిద్ధతను డిమాండ్ చేస్తున్నాయి. వాటిలో మొదటిది ప్రభాస్ ఎంట్రీ. మాములుగా ప్యాన్ ఇండియా మూవీ అంటే హీరో లాంచ్ మహా అయితే మొదటి అయిదు పది నిమిషాల్లోనే జరిగిపోతుంది. కానీ కల్కిలో మాత్రం కాస్త ఆలస్యంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మరీ లేట్ కాదు కానీ ఇంకెంతసేపు అనే ఫీలింగ్ వస్తుందట.
మూడు ప్రపంచాలను పరిచయం చేసే క్రమంలో దర్శకుడు నాగఅశ్విన్ ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కాసేపు అమితాబ్ డామినేషన్ అనిపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒక్కసారి భైరవ ప్రవేశం జరిగిపోయాక కథా కథనాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయని అంటున్నారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామ పరిచయం, కలి పురుషుడి అవతారం గిరించి వివరణ, అశ్వద్ధామకు సంబంధించిన ఎపిసోడ్ వగైరాలు డిటైల్డ్ గా ఉండటం వల్ల రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ లో ఉండదని వినికిడి. ఎప్పుడూ చూడని సరికొత్త అనుభూతికి ముందే సిద్ధపడటం ఒకరకంగా అవసరమే.
తినబోతు రుచులెందుకు కానీ భైరవగా ప్రభాస్ ని సూపర్ హీరో పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. ఆదిపురుష్ గాయం, సలార్ హిట్ అయినా పూర్తిగా సంతృప్తిపరచలేకపోయిన వైనం తదితరాలన్నీ కల్కి 2898 ఏడి పూర్తిగా తగ్గిస్తుందని అభిమానుల నమ్మకం. ఏపీ తెలంగాణలో ఉదయం 4 గంటల నుంచే స్పెషల్ షోలు మొదలు కానుండగా కొన్నిచోట్ల మూడు నుంచే పడతాయని తెలిసింది. ఎలాగూ ఓవర్సీస్ షోల రిపోర్ట్ తెల్లవారకుండానే వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతున్న వాళ్ళు కూడా ఆన్ లైన్ లో కల్కి కబుర్లు వెతుక్కోవడంలో బిజీగా ఉంటారు.
This post was last modified on June 26, 2024 6:23 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…