నిన్న విడుదలైన భారతీయుడు 2 ట్రైలర్ మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఊహించని విధంగా అటు తమిళంలోనూ అసంతృప్తి చెలరేగడం శంకర్ బృందాన్ని షాక్ కి గురి చేసి ఉంటుంది. కథను దాచకుండా కీలకమైన పాయింట్ ని చెప్పేసిన టీమ్ అంచనాలు పెంచే విధంగా ఎడిట్ చేయించలేదనే కామెంట్స్ అభిమానుల్లో వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ చాలా గెటప్పులు వేసినా, వయసు మళ్ళిన దేహంతో నమ్మశక్యం కాని ఫైట్లు చేసినా అవేవి ఆశించిన ఎగ్జైట్ మెంట్ కలిగించలేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఫిర్యాదు. ఇది నాణేనికి ఒక వైపు. పాజిటివ్ గా ఉన్న రెండో వైపు కూడా చూద్దాం.
ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా సేనాపతికి సరైన బ్యాక్ గ్రౌండ్ శంకర్ సెట్ చేశారని, అంచనాలు అందుకోవడం ఖాయమని మరికొందరు అభిప్రాయంపడుతున్నారు. ఏది ఏమైనా శంకర్ స్టామినాకు తగట్టు లేదనేది అధిక శాతం వినిపిస్తున్న అభిప్రాయం. విడుదలకు ఇంకో పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో హైప్ పెంచుకోవడం చాలా అవసరం. అందుకే కమల్, శంకర్, సిద్దార్థ్ నిన్న చెన్నైలో ట్రైలర్ లాంచ్ జరగడం ఆలస్యం వెంటనే ముంబై వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ నెలాఖరులో హైదరాబాద్ వేదికగా మరో పెద్ద వేడుక జరుగనుంది.
భారతీయుడు 2 విషయంలో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే శంకర్ నెక్స్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ఇదే సంవత్సరం వస్తోంది కాబట్టి. మూడేళ్ళకు పైగా విలువైన సమయాన్ని కేవలం శంకర్ కోసం త్యాగం చేసిన రామ్ చరణ్ దానికి తగ్గ ఫలితం అందుకోవాలని వేరే కమిట్ మెంట్లకు వెళ్లకుండా అడిగినప్పుడల్లా కాల్ షీట్స్ ఇచ్చాడు. బుచ్చిబాబుతో ఆర్సి 16 ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇదే. భారాతీయుడు 2 బ్లాక్ బస్టర్ అయితే హ్యాపీనే, అది గేమ్ ఛేంజర్ కు ఉపయోగపడుతుంది. శంకర్ మీద నమ్మకం రెట్టింపవుతుంది. లేదంటేనే లేనిపోని సమస్యలు, చిక్కులు.
This post was last modified on June 26, 2024 10:43 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…