Movie News

సలార్ ఆర్ఆర్ఆర్ అన్నీ వెనుకబడుతున్నాయ్

విడుదలకు రెండు రోజులు మిగిలి ఉండగానే కల్కి 2898 ఏడి అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. కొద్దిరోజుల ముందు వరకు తగినంత హైప్ లేదని బాధపడిన అభిమానులే ఇప్పుడు టికెట్లు దొరక్క వైజయంతి ఆఫీస్ ముందు ధర్నాలు చేసే దాకా వచ్చారు.

చాలా చోట్ల సింగల్ స్క్రీన్లలో టికెట్ ముక్క దొరకడం లేదు. ఎంతో రికమండేషన్ ఉన్నా సరే అంత సులభంగా పని జరగడం లేదు. కేవలం హైదరాబాద్ సిటీనే తీసుకుంటే ఇప్పటికే 15 కోట్ల గ్రాస్ కి దగ్గరగా ఉన్న కల్కి ఇంతకు ముందు టాప్ టూలో ఉన్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, ఆర్ఆర్ఆర్ లను అలవోకగా దాటేసింది.

ఇంకో నలభై ఎనిమిది గంటలు ఉన్న నేపథ్యంలో ఈ నెంబర్స్ లో భారీ మార్పు చోటు చేసుకోనుంది. ఏపీ జిఓ రాత్రి ఆలస్యంగా వచ్చింది కాబట్టి టికెట్ల అమ్మకాలు పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. థియేటర్లు, షోల కేటాయింపులో పంపిణీదారులు బిజీగా ఉన్నారు.

ఏ నిమిషంలో అయినా అవి ఫైనల్ అయిపోయి బుక్ మై షో, పేటిఎంలో టికెట్లు ప్రత్యక్షమవుతాయి. హిందీ వెర్షన్ సైతం తొలి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్ ని లక్ష్యంగా పెట్టుకుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి క్యాస్టింగ్ కన్నా ఇది ప్రభాస్ సినిమా అనే బ్రాండ్ ఉత్తరాది ఆడియన్స్ లో బలంగా పని చేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.

నాన్ బాహుబలి, నాని ట్రిపులార్ అంటూ చెప్పుకు వచ్చిన రికార్డులు బహుశా ఇకపై నాన్ కల్కి అని పేర్కొనాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా ఓవర్సీస్ లో పడే మొదటి షోలు, పూర్తిగా తెల్లవారకకముందే ఏపీ తెలంగాణలో పడే ప్రీమియర్ల నుంచి వచ్చే రిపోర్టులు, రివ్యూలు.

యావరేజని వచ్చినా బ్లాక్ బస్టరని తీర్పిచ్చినా వసూళ్లు మాత్రం మొదటి వీకెండ్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి . పైగా ఆపై వారం ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ కొత్త రిలీజ్ లేదు. ఈ నేపథ్యంలో కల్కి చేయబోయే అరాచకానికి బాక్సాఫీస్ సాక్షిగా మారబోతోంది. బాహుబలి రేంజ్ సక్సెస్ ఒక్కటే ఫ్యాన్స్ కోరుకుంటున్నది.

This post was last modified on June 25, 2024 12:05 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

2 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago