బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రమంగా సౌత్ సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. హాలీవుడ్ లో చేయడం కన్నా దక్షిణాది స్టార్స్ తో స్క్రీన్ పంచుకోవడంలోనే ఎక్కువ కిక్ ఉంటుందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సల్లు భాయ్ దానికి తగ్గట్టే అడుగులు వేస్తున్నాడు.
చిరంజీవి గాడ్ ఫాదర్ లో అడగ్గానే చిన్న క్యామియో చేసిన సల్మాన్ అందులో తన పాత్ర నిడివి, ప్రాధాన్యం చూసుకోకుండా కేవలం మెగా ఫ్యామిలీ అడిగిందని ఓకే చెప్పేశాడు. అదేమీ బ్లాక్ బస్టర్ కాలేదు కానీ అంత ఇష్టపడి చేసిన ఆ పాత్ర తెరపై ఆశించిన స్థాయిలో పండలేదు. ఇక విషయానికి వద్దాం.
అల్లు అర్జున్ నో చెప్పాక దర్శకుడు అట్లీ సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్టు సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని ముంబై టాక్. ఇందులో కీలకమైన ఒక పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
పూర్తి లెన్త్ కాకున్నా పెదరాయుడు టైపులో కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయే రేంజ్ లో ఆయన ఎపిసోడ్ ఉంటుందట. అయితే రజని దాకా ఇంకా స్టోరీ నెరేషన్ వెళ్ళలేదు. ప్రస్తుతం వెట్టయాన్ పూర్తి చేసిన తలైవా ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ కూలీ సెట్లో అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ అట్లీ చెప్పిన కథ నచ్చితే ఒకేసారి రజని, సల్మాన్ లను మల్టీస్టారర్ రూపంలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఈ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. మురగదాస్ తో ప్రస్తుతం సికందర్ చేస్తున్న కండల వీరుడు అందులో కోరిమరీ రష్మిక మందన్నను హీరోయిన్ గా ఓకే చేయించాడు.
సౌత్ మార్కెట్ మీద కన్నేయడం వల్ల ఇలా ఆలోచిస్తున్నారో ఏమో కానీ సల్మాన్ మనసులో బాహుబలి, కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాల్లో నటించాలని తెగ కోరికగా ఉందట. అలాంటివి కేవలం సౌత్ డైరెక్టర్లు మాత్రమే తీయగలరు కాబట్టి ఎవరైనా స్టోరీ చెబుతానంటే వద్దనకుండా వింటున్నారని తెలిసింది.
This post was last modified on June 24, 2024 6:01 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…