Movie News

కమల్ ఫ్యాన్స్‌లో నిరాశ

‘కల్కి’ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే నటిస్తున్నారని ఆరంభంలో చెప్పినపుడే కాస్టింగ్ పరంగా ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత వీరికి కమల్ హాసన్ కూడా తోడవడంతో ఎగ్జైట్మెంట్ డబులైంది.

పైగా కమల్ చేస్తున్నది విలన్ పాత్ర అని తేలడంతో ప్రభాస్ వెర్సస్ కమల్ ఫైట్ వేరే లెవెల్లో ఉంటుందని ఊహించుకున్నారు. కానీ రిలీజ్ టైంకి వచ్చేసరికి ఈ క్లాష్ విషయంలో ఎగ్జైట్మెంట్ తగ్గిపోతోంది. ముఖ్యంగా కమల్ ఫ్యాన్స్‌కు ‘కల్కి’ విషయంలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు.

అందుక్కారణం.. కమల్‌కు ప్రోస్థటిక్ మేకప్ వేసి గుర్తు పట్టని విధంగా తయారు చేయడం. కమల్‌కు భారతీయుడి తరహా మేకప్ వేసే ఓకే కానీ.. కల్కి మేకప్ అయితే అక్కడున్నది కమల్ అని గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. ఆ పాత్రలో కమల్ నటించినా.. టిను ఆనంద్ నటించినా ఒకటే అన్నట్లుగా తయారైంది పరిస్థితి.

ముఖ కవళికలు చూసినా అది కమలే అని చెప్పేలాగా లేదు. ఈ పాత్ర లక్షణాల దృష్ట్యా దాన్ని అలా చూపించడమే కరెక్ట్ కావచ్చు. కానీ అలాంటి పాత్రకే కమల్‌నే ఎంచుకోవాల్సిన అవసరమైతే లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమల్ పెర్ఫామెన్స్ అంటూ ఇందులో చూడ్డానికి ఏమీ లేదని.. ఆ పాత్ర ఎవరు చేసినా ఒకటే అని.. కమల్ దీనికి ప్రత్యేకత చేకూర్చడానికి ఛాన్స్ లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అందుకే ‘కల్కి’ రిలీజ్ దగ్గర పడుతుండగా లోకనాయకుడి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఏమాత్రం కనిపించడం లేదు. మరి ప్రోమోలు చూసినపుడు కలిగిన అంచనాలకు మించి సినిమాలో కమల్ ఏమైనా భిన్నంగా చేశాడా.. ఆయన మామూలు అవతారంలో కూడా కనిపించి పెర్ఫామెన్స్ పరంగా తన ముద్రను చాటుకుంటాడా అన్నది చూడాలి.

This post was last modified on June 23, 2024 12:47 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

33 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago