ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ఇంకో వారం రోజులు కూడా సమయం లేదు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా రిలీజైన కొత్త ట్రైలర్ సినిమా మీద అంచనాలను ఇంకా పెంచింది.
ఈ ట్రైలర్లో కొన్ని సర్ప్రైజులు కూడా కనిపించాయి. కొన్ని కొత్త పాత్రలను పరిచయం చేశారు. మలయాళ యువ నటి మాళవిక నాయర్ ఇందులో కీలక పాత్రే చేస్తున్న విషయం రిలీజ్ ట్రైలర్లో వెల్లడించారు. ఇంకోవైపు మరో మలయాళ టాలెంటెడ్ హీరోయిన్ అన్నా బెన్ తొలిసారిగా ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. కుంబలంగి నైట్స్, హెలెన్, కప్పెల లాంటి చిత్రాలతో అన్నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె ‘కల్కి’లోని అద్భుత ప్రపంచంలో ఫ్యూచరిస్టిక్ వెహికల్ నడుపుతూ కనిపించింది.
ఐతే సినిమాలో ఇలాంటి సర్ప్రైజింగ్ క్యారెక్టర్లు మరిన్ని ఉంటాయని.. వైజయంతీ మూవీస్‌తో మంచి అనుబంధం ఉన్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లు కూడా ఆశ్చర్యకర పాత్రలతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తారని అంటున్నారు. అంతే కాక కీర్తి సురేష్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమని.. ఆమె వాయిస్ ఓవర్ ఇస్తుందని అంటున్నారు.
అంతే కాక రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా ఈ సినిమాలో క్యామియో రోల్స్‌లో కనిపిస్తారన్నది లేటెస్ట్ హాట్ న్యూస్. ‘కల్కి’ కథ ప్రకారం భవిష్యత్తులోకి ప్రయాణం ఉంటుంది. మరి ఆ భవిష్యత్తులో రాజమౌళి, ఆర్జీవీ నిజ జీవిత పాత్రల్లో కనిపించి ఏమైనా సర్ప్రైజ్ చేస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వీళ్లిద్దరూ నిజంగా సినిమాలో ఉంటే థియేటర్లు హోరెత్తిపోతాయనడంలో సందేహం లేదు.
This post was last modified on June 22, 2024 6:40 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…