నాగ చైతన్య అభిమానులు అంత సులభంగా మర్చిపోలేని డిజాస్టర్స్ లో కస్టడీది ప్రత్యేక స్థానం. చైతు, కృతి శెట్టి కలయికలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, రాంకీ లాంటి క్యాస్టింగ్ తో పాటు యువన్ శంకర్ రాజా సంగీతపు హంగులు ఎన్ని ఉన్నా దర్శకుడు వెంకట్ ప్రభు కనీస స్థాయిలో మెప్పించేలా తీయలేకపోయాడు. సామాన్య కానిస్టేబుల్ గా చైతన్య మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ అదంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఇప్పుడిదే వెంకట్ ప్రభు తమిళంలో విజయ్ డ్యూయల్ రోల్ తో ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం తీశాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న టీజర్ తో హైప్ పెంచేశాడు.
విజయ్ ద్విపాత్రల్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన గోట్ లో విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. వయసు తక్కువగా కనిపించడం కోసం విజయ్ కి ప్రత్యేక మేకప్ చేయడమే కాక దాని కోసమే ఎనిమిది కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి స్టోరీ రాలేదనే రేంజ్ లో ఊరిస్తున్నారు. కేవలం నిమిషంలోపు ఉన్న వీడియోనే అయినప్పటికీ ఇద్దరు విజయ్ లు విదేశాల్లో బైకు మీద వెళ్తుండగా వెనకాల వందలాది గూండాలు, పోలీసులు వేటాడే షాట్ చూస్తుంటే వామ్మో అనిపిస్తోంది. ఇక ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పాలా.
ఇది చైతు ఒక్కడికే జరగలేదు. లింగుస్వామిని గుడ్డిగా నమ్మడం వల్ల రామ్ కి ది వారియర్ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. వీళ్ళ ట్రాక్ రికార్డు చూసి తొందరపడి కథలను విశ్లేషించుకోకపోవడం వల్ల వచ్చిన నష్టమిది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి కానీ ఇకపై మన హీరోలు కోలీవుడ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టడీకు ముందు మానాడుతో సూపర్ హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు రిలీజ్ కు ముందే గోట్ మీద బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇస్తున్నాడు. ఎటొచ్చి చైతుకే కస్టడీ పేరుతో షాక్ ఇచ్చాడు. నేటివిటీ తెలియని వాళ్ళతో రిస్క్ చేస్తే అలాగే ఉంటుంది మరి.
This post was last modified on June 22, 2024 11:49 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…