Movie News

నాని నిర్ణయాలు సూటిగా స్పష్టంగా

న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది హాయ్ నాన్నతో సూపర్ హిట్, దసరాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాక ఈ సంవత్సరం ప్రేక్షకులను పలకరించలేదు. ఆగస్ట్ 29న సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా డివివి దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇదిలా ఉండగా నాని ముందు ఓకే అనుకున్న రెండు సినిమాలు రద్దు కావడం ఫ్యాన్స్ ని నిరాశపరిచిన సంగతి తెలిసిందే. సుజిత్ డైరెక్షన్ లో ఒకటి, బలగం వేణుతో మరొకటి రెండు సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి.

కారణాలు ఏమైనా స్క్రిప్టులు పూర్తి సంతృప్తినివ్వలేదనే టాక్ అంతర్గత వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో నాని చాలా సూటిగా స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటున్న వైనం తేటతెల్లం అవుతోంది. ఇప్పుడు నాని రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖరారే. వాటిలో మొదటిది హిట్ 3 థర్డ్ కేస్. శైలేష్ కొలను స్టోరీని ఒక కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. వెంకటేష్ సైంధవ్ నిరాశపరిచినప్పటికీ అతని మీద నమ్మకంతో నాని ఈసారి తన ప్రొడక్షన్ లోనే హిట్ సిరీస్ ఛాన్స్ కొనసాగిస్తున్నాడు. దీనితో పాటు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలకు ఆల్రెడీ ఓకే చెప్పేశాడు కాబట్టి దాని పనులు కూడా జరుగుతున్నాయి.

2025లో ఖచ్చితంగా రెండు రిలీజులు ఉండాలనేది నాని టార్గెట్. ప్రతి సంవత్సరం ఇలాగే ప్లాన్ చేసుకున్నా ఈసారి మిస్ అయ్యింది. వచ్చే ఏడాది అలా జరగకూడదనేది తన సంకల్పం. ఒకవేళ వేణు, సుజిత్ చెప్పిన కథల గురించి టైం ఇచ్చి, ఆలోచన చేయకపోయి ఉంటే ఈపాటికి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళేది. రవితేజలాగే నానికి ఎక్కువ గ్యాప్ రావడం ఇష్టం ఉండదు. అది నెలలైనా సరే. కానీ 2024 కేవలం సరిపోదా శనివారంతో సరిపెట్టాల్సి రావడం వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేకపోయినా పరిస్థితులు అలా ప్రేరేపించాయి. శౌర్యువ్ కూడా నాని కోసం ఒక కథను సిద్ధం చేస్తునట్టు వినికిడి.

This post was last modified on June 21, 2024 6:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago