మన దేశం వరకు వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ దక్కించుకోవడంలో కొన్ని షోలు ప్రధాన పాత్ర పోషించాయి. వాటిలో మిర్జాపూర్ ఒకటి. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని బ్లాక్ బస్టర్ సక్సెస్, ఫాలోయింగ్ దీని సొంతం. నటుడు పంకజ్ త్రిపాఠి గత రెండేళ్లుగా డేట్లు ఇవ్వలేనంత బిజీగా మారిపోయాడంటే దానికి కారణం ఇదే. రెండు సీజన్లు ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయం సొంతం చేసుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ కి చందాదారులు పెరగడంతో ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ఈ షో పోషించిన పాత్ర చాలా కీలకం. ఇప్పుడీ మిర్జాపూర్ సీజన్ 3 వచ్చే నెల అయిదో తేదీన విడుదలకు సిద్ధమయ్యింది.
నిన్న ట్రైలర్ విడుదల చేస్తే ఒక రోజు దాటకుండానే ఏడు మిలియన్ల వ్యూస్ దాటేయడం చిన్న విషయం కాదు. నిజానికి మిర్జాపూర్ కంటెంట్ మీద ముందు నుంచి విమర్శలున్నాయి. హింసను హద్దులు దాటించడం, విచ్చలవిడిగా బూతులు మాట్లాడించడం, వరసలు మర్చిపోయి శృంగార సంబంధాలు చూపించడం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. అయినా ఇవేవి షో ఆదరణను తగ్గించలేకపోయాయి. పై పెచ్చు కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందనే డిమాండ్ క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. అందుకే మూడో భాగం మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి.
ఊరిని గడగడా వణికించే ఒక పేరుమోసిన గూండా ఫ్యామిలీలో తాత, తండ్రి, కొడుకులు కరుడుగట్టిన నేరస్థులైతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనే పాయింట్ చుట్టూ ఈ మాఫియా డ్రామా నడుస్తుంది. కలీన్ భయ్యాని కాదని నేర సామ్రాజ్యపు సింహాసనాన్ని గుడ్డు భాయ్ ఆక్రమించుకోవడానికి చేసే ప్రయత్నం చుట్టూ మిర్జాపూర్ 3 నడుస్తుంది. ట్రైలర్ చివర్లో పంజాజ్ త్రిపాఠిని చూపించడం ద్వారా మిగిలిన పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని మేకర్స్ స్పష్టం చేశారు. హిందీ, తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో మిర్జాపూర్ 3 అనువాద రూపంలో రానుంది.
This post was last modified on June 21, 2024 2:05 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…