ఇప్పటిదాకా ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ మొదటి స్థానంలో ఠీవిగా కూర్చున్న హనుమాన్ వచ్చి ఆరు నెలలవుతున్నా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ఖరారు కాలేదు. సీక్వెల్ జై హనుమాన్ ప్రకటన వచ్చింది కానీ షూటింగ్ ఎప్పటి నుంచి, క్యాస్టింగ్ ఎవరెవరు, అదే నిర్మాతనా లాంటి విషయాలేవీ ఫైనల్ కాలేదు. అసలు తేజ సజ్జనే ఉంటాడో లేదో ఖరారుగా చెప్పలేకపోతున్నారు. ఈ గ్యాప్ కి కారణం రణ్వీర్ సింగ్ తో ప్లాన్ చేసుకున్న బాలీవుడ్ మూవీనే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తలపెట్టిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడం ఊహించని పరిణామం.
అలా అని ప్రశాంత్ వర్మ ఖాళీగా లేడు. సినిమాటిక్ యునివర్స్ కి సంబంధించి కథలు సిద్ధం చేస్తున్నాడు. గతంలో తాను ఒప్పుకున్న అధీరాని నా సామిరంగ ఫేమ్ విజయ్ బిన్నీకి ఇచ్చే ఆలోచన చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన ఆక్టోపస్ కు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. తను కథ అందించిన దేవకీనందన వాసుదేవ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టింది. రిలీజ్ సమయంలో ప్రశాంత్ వర్మ బ్రాండ్ ని సదరు టీమ్ ఉపయోగించుకోనుంది. అశోక గల్లా హీరోగా గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఇది రూపొందింది.
ముందుగా అనుకున్నట్టు 2025లో జై హనుమాన్ వచ్చే ఛాన్స్ లేదు. రాముడు, హనుమంతుడు పాత్రలకు స్టార్ హీరోలు దొరికే వరకు నిరీక్షణ తప్పదు. బాలీవుడ్ రామాయణంలో చేస్తున్న నటులను రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రశాంత్ వర్మ మీద ఉంది. స్టార్ క్యాస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్న ఈ దర్శకుడు ముందైతే ఫైనల్ వెర్షన్ లాక్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన పనులు చూసుకోబోతున్నాడు. హనుమాన్ ఏదో మాములు హిట్ అయితే ఇంత చర్చ ఉండేది కాదు కానీ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కావడం వల్ల ప్రశాంత్ వర్మ తొందరపెడి నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేడు.
This post was last modified on June 20, 2024 11:38 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…