కొంత కాలం క్రితం ఏపీ మాజీ సీఎం జగన్ ఛాంబర్లో టాలీవుడ్ అగ్ర హీరోలు, పెద్దల సమావేశంలో దయచేసి మా సమస్యల్ని అర్థం చేసుకోమంటూ చిరంజీవి దండం పెడుతూ విన్నవించుకున్న వీడియో అభిమానుల మనసులో నుంచి అంత సులభంగా చెరిగేది కాదు. ఇది అవమానంగా ఫీలైన ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు ప్రచార వేదికల్లో దీని గురించి ప్రస్తావించి సీరియస్ కావడం అందరికీ గుర్తే. పైగా ఇది చాలదన్నట్టు టికెట్ రేట్ల పెంపు కోసం బడా ప్రొడ్యూసర్లు సైతం పరుగున వెళ్లి వైసిపి మంత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరీ మహాప్రభో అనాల్సి వచ్చింది.
కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. జనసేన తరఫున గెలిచి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి అలంకరించిన కందుల దుర్గేష్ మినిస్టర్ హోదాలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సెట్ కు వెళ్లి మరీ కలుసుకోవడం, ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరలవుతోంది. పవన్ సూచనల మేరకు దుర్గేష్ వెళ్లి కలిసి ఉండొచ్చు కానీ ఒక మంత్రి స్థాయి వ్యక్తి అగ్ర హీరోను కలుసుకుని శుభాకాంక్షలు అందుకోవడం మాత్రం గత కొన్నేళ్లలో చూడని అరుదైన దృశ్యం. స్వతహాగా చిరు ఫాన్ అయిన కందుల దుర్గేష్ కు ఆయన జీవితంలో అతి గొప్ప క్షణాల్లో ఇదో మధుర జ్ఞాపకంగా మిగులుతుంది.
దీన్ని కేవలం మాములు కలయికగా చూసేందుకు లేదు. ఎందుకంటే భవిష్యత్తులో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలు, నిర్ణయాలు అన్నీ కందుల దుర్గేష్ ద్వారానే జరగబోతున్నాయి. తనకు ఎలాంటి భేషజాలు లేవని, అధినేత మనోగతం ప్రకారమే నడుచుకుంటాని ఈ చర్య ద్వారా చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. పవన్ పార్టీ మనిషే కీలక శాఖ నిర్వహిస్తుండటంతో సినిమా వర్గాల్లో రాబోయే రోజుల గురించి గొప్ప ఆశాభావం కనిపిస్తోంది. చిరుతో పాటు విశ్వంభర టీమ్ మొత్తం మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశం అయ్యింది. పలు రాజకీయ సినిమా అంశాలు చర్చించుకున్నారట.
This post was last modified on June 20, 2024 11:30 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…