కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో చూడరు. ఆ తర్వాత కూడా వారికి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్, ట్రెడిషనల్ రోల్సే వస్తుంటాయి. కానీ ఇలాంటి ముద్ర వేయించుకోడానికి హీరోయిన్లు ఇష్టపడరు. కాబట్టి తమ లుక్ మారుస్తుంటారు. గ్లామర్ సొబగులు అద్దుకుంటూ ఉంటారు.
దీంతో క్రమంగా వారిని చూసే కోణం మారిపోతుంది. పాత్రలు కూడా మారుతుంటాయి. కీర్తి సురేష్ కెరీర్లో చాన్నాళ్లు ఈ ‘ట్రెడిషనల్’ జోన్లోనే ఉండిపోయింది. కానీ గత కొన్నేళ్లుగా ఆమె ఎంత గ్లామరస్‌గా కనిపిస్తోందో తెలిసిందే. అందుకు తగ్గట్లే పాత్రలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు కన్నడ భామ రుక్మిణి వసంత్ కూడా ఈ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
‘సప్త సాగరాలు దాటి’ లాంటి కల్ట్ లవ్ స్టోరీతో కథానాయికగా పరిచయం అయింది రుక్మిణి. ఆమె సినిమా అంతా చుడీదార్లలో సగటు అమ్మాయిలా కనిపించింది. తన అభినయం అందరినీ కట్టిపడేసింది.
ఆ సినిమా తర్వాత రుక్మిణికి అవకాశాలు వరుస కట్టాయి కానీ.. అవన్నీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడే. గ్లామర్ టచ్ తక్కువ. ఐతే ‘కాంతార: చాప్టర్-1’లో గ్లామర్, పెర్ఫామెన్స్ రెంటితోనూ ఆకట్టుకున్న రుక్మిణి.. ఇటీవల బయట ఈవెంట్లలో కనిపించేటపుడు సరికొత్త లుక్‌తో దర్శనమిస్తోంది.
తాజాగా ఒక అవార్డు వేడుకలో ఆమె స్టైలింగ్ చూసి అందరూ షాకైపోయారు. కెరీర్లో ఎన్నడూ లేనంత గ్లామరస్‌గా తయారై వచ్చిన రుక్మిణి.. ఇంటర్నెట్‌ను తుపానులా ముంచెత్తింది.
రుక్కులో ఈ కోణం చూడలేదంటూ కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌తో పోలుస్తూ.. ఆమెను మించిన ఫిజిక్, గ్లామర్ అంటూ రుక్మిణిని కొనియాడుతున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రుక్మిణి ఫొటోలు మామూలుగా వైరల్ కావట్లేదు.
This post was last modified on February 21, 2026 11:39 pm
ఏపీ రాజధాని అమరావతిలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వచ్చేశాయి. ఆర్బీఐ వంటి బ్యాంకింగ్ సంస్థలు…
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సూపర్ స్టార్లలో ఒకడిగా అవతరించిన యశ్ నుంచి.. ఆ తర్వాత…
టెక్నాలజీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఏఐ నిపుణులకు భారీ జీతాలు ఇస్తారని తెలుసు. కానీ ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రముఖ…
కొత్త శుక్రవారం వచ్చింది. బోలెడు రిలీజులు తెచ్చింది. తమ సినిమాని జనం చూసేందుకు ఏమేం చేయాలో ప్రమోషన్ల పరంగా అన్ని…
అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే సిరీస్‌తో భారత లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుతూనే వున్నాయి. తొలుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. కూటమి పై చేయి సాధించింది.…