ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప-2’ ముందు ప్రకటించినట్లు ఆగస్టు 15న విడుదల కాదన్న ప్రకటన దేశవ్యాప్తంగా సినీ ప్రియులను నిరాశకు గురి చేసింది. ఇప్పటికే ఆ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకో నాలుగు నెలలు అదనంగా నిరీక్షించాల్సి వస్తోంది. ‘పుష్ప-2’ వాయిదా వల్ల చాలా సినిమాల షెడ్యూళ్లు తారుమారు అయ్యాయి. ‘పుష్ప-2’ బడ్జెట్, బిజినెస్ మీద కూడా వాయిదా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది.
అదే సమయంలో వేరే సినిమాలు కొన్నింటికి ‘పుష్ప-2’ వాయిదా నిర్ణయం ప్లస్ అవుతోంది. క్రేజీ డేట్ అయిన ఆగస్ట్ 15ను వాడేసుకోవడానికి ‘డబుల్ ఇస్మార్ట్’ లాంటి చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. మరోవైపు ‘పుష్ప-2’ వాయిదా నిర్ణయం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ క్రేజ్, బిజినెస్‌ను పెంచిందన్నది ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ నెల చివర్లో ‘కల్కి’ లాంటి బారీ చిత్రం వచ్చాక భారతీయ ప్రేక్షకుల దృష్టంతా ‘పుష్ప-2’ మీదే ఉండేది. కానీ ఆ సినిమా వాయిదా పడడంతో ప్రేక్షకుల ఫోకస్ ‘దేవర’ మీదికి మళ్లనుంది. మధ్యలో ‘ఇండియన్-2’ లాంటి పెద్ద సినిమా ఉన్నా సరే.. మాస్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించేది ‘దేవర’నే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అది మరింత పెరిగింది. రిలీజ్ టైంకి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి క్రేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
విడుదలకు ఇంకా వంద రోజులు ఉండగానే ‘దేవర’ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోవడం విశేషం. ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ రేట్లకే ఈ సినిమాను కొన్నారు బయ్యర్లు. తెలుగు రాష్ట్రాల వరకే ‘దేవర’ థియేట్రికల్ హక్కులు రూ.120 కోట్ల మేర అమ్ముడవడం విశేషం. ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ రూ.200 కోట్ల మార్కును టచ్ చేస్తోంది.
This post was last modified on June 20, 2024 11:30 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…