అమితాబ్ బచ్చన్.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన హీరోల్లో ఒకరు. ఒకప్పుడు, ఇప్పుడు దేశమంతా ఎంతో గౌరవించే ఆర్టిస్టుల్లో ఒకరైన అమితాబ్.. 80 ఏళ్లు పైబడ్డప్పటికీ చురుగ్గా సినిమాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
అలాంటి లెజెండరీ నటుడు.. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వినీదత్‌కు పాదాభివందనం చేసిన ఉదంతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. దత్ నిర్మించిన మెగా మూవీ ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ అశ్వథ్థామగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ బుధవారం ముంబయిలో జరిగింది.
ఈ వేడుకలో పాల్గొన్న అమితాబ్.. స్టేజ్ మీదికి అశ్వినీదత్ రాగానే దగ్గరికి వెళ్లి ముందుకు వంగి పాదాభివనందనం చేయబోయారు. దత్ ఆయన్ని వారించడమే కాక ప్రతిగా తాను వంగి అమితాబ్ తరహాలోనే పాదాభివందనం చేశారు. విశేషం ఏంటంటే.. అమితాబ్ కంటే దత్ చిన్నవాడు. బిగ్-బి వయసు 81 ఏళ్లు కాగా.. దత్‌కు ఇంకా 73 ఏళ్లే. స్థాయి పరంగా చూసుకున్నా కూడా అమితాబ్ ముందు దత్ చిన్నవాడే. కానీ నిర్మాతగా దత్ ప్రయాణం, ‘కల్కి’ లాంటి మెగా మూవీ కోసం ఆయన చూపించిన తపన చూసి అమితాబ్ ఫిదా అయి ఆయన్నిలా గౌరవించి ఉండొచ్చు. వయసు, స్థాయి చూడకుండా అమితాబ్ ఇలా పాదాభివనందనం చేశాడంటే ఆయన హుందాతనానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు.
ఇక ఈ వేడుకలో దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి బిగ్-బి గొప్పగా మాట్లాడాడు. ‘కల్కి’ కథ వినగానే ఆశ్చర్యపోయానని, అతను రోజూ ఏం తాగుతాడని ఆశ్చర్యం కలిగిందని అమితాాబ్ వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on June 20, 2024 10:54 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…