పెద్ద సినిమాల విడుదల తేదీ వ్యవహారం క్రమంగా సస్పెన్స్ మూవీని మించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ కు వెళ్ళిపోయాక ఒక్కసారిగా ఇతర నిర్మాతల ప్లానింగ్ లో మార్పులు తలెత్తుతున్నాయి. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఎన్బికె 109 షూటింగ్ ఇంకా పూర్తవ్వనప్పటికీ 2024లోనే రిలీజ్ చేయాలనేది నిర్మాత సంకల్పం. ఎందుకంటే ఇదే బ్యానర్ లో రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో తీస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ని 2025 సంక్రాంతికి లాక్ చేశారు కనక. ఇక్కడే కొన్ని చిక్కులు కనిపిస్తున్నాయి.
పుష్ప 2 డిసెంబర్ ఆరున వస్తుంది కాబట్టి రెండు వారాల గ్యాప్ తీసుకుని ఇరవైన బాలయ్య వస్తే ఇబ్బంది ఉండదు. కానీ తండేల్, రాబిన్ హుడ్ ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. వాటిలో ఒకటి తప్పుకోవడం ఫిక్సని ఫిలిం నగర్ టాక్. నితిన్ మూవీని నవంబర్ కు జరపాలని చూస్తున్నారు. ఎలాగూ తమ్ముడుని ఫిబ్రవరిలో తీసుకొచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఈ గ్యాప్ సరిపోతుంది. కానీ తండేల్ ని ఏం చేయాలనేది అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే వీలైనంత సోలోగా తండేల్ రావడం అవసరం. నేరుగా బాలయ్య లాంటి ఫుల్ ఫామ్ లో ఉన్న బడా స్టార్ హీరోతో తలపెడితే పెద్ద రిస్క్ అవుతుంది.
మరి చివరికి ఏం జరుగుతుందంటే ఎవరైనా ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దర్శకుడు బాబీ మాత్రం డిసెంబర్ లక్ష్యంగా షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే కీలక భాగం పూర్తయ్యింది. ఎన్నికలు, ఫలితాలు, ప్రమాణ స్వీకారాలు తదితరాల వల్ల బాలయ్య గ్యాప్ తీసుకున్నాడు. 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. హిందుపూర్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ తరఫున తను ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా డేట్లు ఇచ్చేసి సహకరించాలనేది బాలయ్య ఆలోచన. ఒకవేళ డిసెంబర్ మిస్ అయ్యి సంక్రాంతికి బాలయ్య వస్తే రవితేజది డ్రాప్ చేయాల్సి ఉంటుంది.
This post was last modified on June 20, 2024 9:24 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…