విజయ్ సేతుపతికి తమిళంలోనే కాక వేరే భాషల్లో కూడా నటుడిగా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో ‘సైరా’; ‘ఉప్పెన’ చిత్రాలు చేయడానికి ముందే అతను ఇక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.
కానీ తమిళంలో అతను హీరోగా నటించిన చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ ఏవీ పెద్దగా ఆడలేదు. సోలో హీరోగా తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు పుల్ చేసేంత కెపాసిటీ సేతుపతికి లేదనే అంతా అనుకున్నారు. అందుకే తన కొత్త చిత్రం ‘మహారాజ’ను తమిళంతో పాటే తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేస్తుంటే ఇదొక వృథా ప్రయాస అనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఐతే ఈ సినిమా ప్రోమోలైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. కంటెంట్ మీద ధీమాతో రిలీజ్‌కు ముందు రోజే ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేశారు. ఆశ్చర్యకరంగా ఆ షోలన్నీ జనాలతో నిండిపోయాయి. పైగా మంచి టాక్ వచ్చింది. ఇంకేముంది తొలి రోజు నుంచి మంచి వసూళ్లతో సాగిపోయింది ‘మహారాజ’.
గత వారాంతంలో సుధీర్ బాబు చిత్రం ‘హరోం హర’ మంచి అంచనాల మధ్య రిలీజైంది. దీంతో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిన్న సినిమా కూాడా రిలీజైంది. సుధీర్ చిత్రానికి ఓ మోస్తరు టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. కానీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ని జనాలు పట్టించుకోలేదు.
చివరికి చూస్తే తెలుగు చిత్రాలను వెనక్కి నెట్టి అనువాద చిత్రమైన ‘మహారాజ’ బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. తక్కువ మొత్తానికి సినిమాను కొని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు ‘మహారాజ’ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమాకు వసూళ్లు నిలకడగా ఉన్నాయి.
తమిళంతో కలిపి ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. సోలో హీరోగా సేతుపతి రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. మొత్తానికి అతడికి తన 50వ చిత్రం కంటెంట్ పరంగా మెప్పించడమే కాక వసూళ్లలోనూ దూసుకెళ్లడంతో నిజంగానే ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతోంది.
This post was last modified on June 19, 2024 2:27 pm
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…