ఈ రోజుల్లో సినీ జనాలు సినిమాల మీద కామెంట్లు పెట్టే, విశ్లేషణలు చేసే క్రిటిక్స్‌ను టార్గెట్ చేసుకోవడం సాధారణ విషయం అయిపోయింది. ఒకప్పుడు ఛోటా మోటా క్రిటిక్స్, యూట్యూబర్ల విశ్లేషణల మీద స్పందించడం తమ స్థాయికి తక్కువ అనుకునేవాళ్లు ఇండస్ట్రీ జనాలు.
కానీ ఈ విశ్లేషణల ప్రభావం జనం మీద చాలా ఉంటోందని అర్థం చేసుకోవడం వల్లో ఏమో.. సోషల్ మీడియాలో ఏవైనా తేడా కామెంట్లు, విశ్లేషణలు కనిపిస్తే డైరెక్ట్ ఎటాక్‌కు దిగేస్తున్నారు. తాజాగా హీరో విశ్వక్సేన్.. ‘కల్కి’ సినిమా మీద ఓ యూట్యూబర్ చేసిన అనాలసిస్ మీద ఘాటుగా స్పందించాడు.
సినిమా రిలీజ్ కాకముందే నెగెటివ్ కామెంట్లు చేయడాన్ని తప్పుబడుతుూ.. పది నిమిషాల షార్ట్ ఫిలిం తీసి చూపించు అంటూ ఆ యూట్యూబర్‌కు సవాలు విసిరాడు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఓ తమిళ క్రిటిక్‌ను టార్గెట్ చేసుకున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ నుంచి తాజాగా ఓ షో రీల్ రిలీజైన సంగతి తెలిసిందే. ఐతే ఆ రీల్ ఎలా ఉంది అని కామెంట్ చేయకుండా.. రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ కంటే హీరోయిన్ సెలక్షన్ బాగుంటోందంటూ ఓ తమిళ క్రిటిక్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ హరీష్ శంకర్ కంటపడగానే ఒళ్లు మండినట్లుంది.
ఆ క్రిటిక్‌కు లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇంకా రిలీజ్ కాని సినిమా స్క్రిప్ట్ గురించి ఇలాంటి కామెంట్ చేస్తావా అంటూ.. నిన్ను కమెడియన్‌గా పెట్టుకుని ఉంటే బాగుండేది, అయినా సరే సోషల్ మీడియా వేదికగా కామెడీ కంటిన్యూ చెయ్యి అంటూ పంచ్ వేశాడు హరీష్.
ఈ కామెంట్ మీద సదరు క్రిటిక్ తర్వాత ఏమీ స్పందించలేదు. ఐతే ఆ క్రిటిక్ ఓవరాల్‌గా రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ బాలేదన్న కోణంలో ఈ కామెంట్ పెట్టి ఉంటాడని.. ఈ మధ్య మాస్ రాజా సినిమలు వరుసగా బోల్తా కొట్టిన విషయం మరిచిపోకూడదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on June 19, 2024 2:01 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…