జయాపజయాలు పక్కనపెడితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు మాస్ లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. డబ్బింగ్ వెర్షన్ల రూపంలో హిందీ ఆడియన్స్ కి బాగా చేరువ కావడంతో అనువాద హక్కులకు మంచి ఆదాయం వస్తోంది.
దీన్ని తన వ్యక్తిగత క్రేజ్ గా భ్రమపడిన సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం మూడేళ్ళ విలువైన సమయాన్ని వృథా చేయడం కెరీర్ లోనే అతి పెద్ద పొరపాటు. ఇప్పుడిది తెలుసుకుని ప్రాజెక్టులు చేయడంలో వేగం పెంచాడు. నిర్మాణంలో ఉన్నవాటితో పాటు కొత్తగా ఒప్పుకునే సినిమాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది.
లుదీర్ అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తూ సాయి శ్రీనివాస్ ఒక కథకు ఓకే చెప్పాడని సమాచారం. వామన టైటిల్ తో రూపొందబోయే ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో ఊహించని అంశాలు చాలా ఉంటాయట. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఆల్రెడీ ఒక ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనికి కిష్కిందపురి టైటిల్ పరిశీలనలో ఉంది. వామన రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలుపెట్టనుండగా కౌశిక్ సినిమా కూడా సమాంతరంగా జరిగే అవకాశముంది. ఈ రెండూ తనకు పెద్ద బ్రేకింగ్ పాయింట్స్ అవుతాయనే నమ్మకం సాయిశ్రీనివాస్ లో ఉందట.
ప్రస్తుతం తను టైసన్ నాయుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే వాయిదాల వల్ల విపరీతమైన జాప్యానికి గురైన ఈ మాస్ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది.
చిత్రీకరణలో అవాంతరాల వల్ల పోస్ట్ పోన్ల పర్వానికి బలైన టైసన్ నాయుడు కొత్త షెడ్యూల్ ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యింది. జూలై చివరిలో గుమ్మడికాయ కొట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. దసరా లేదా దీపావళి పోటీలో ఉన్న ఇతర సినిమాలను బట్టి టైసన్ నాయుడు విడుదల తేదీని నిర్ణయించబోతున్నారు.
This post was last modified on June 19, 2024 12:16 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…