కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే కుర్రాడి హత్య కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసు చర్చనీయాంశమవుతున్న తరుణంలోనే దర్శన్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడం మరో సంచలనంగా మారింది.
శ్రీధర్ అనే దర్శన్ మేనేజర్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను దర్శన్ ఫాం హౌస్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడట. శ్రీధర్ సుసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. అంతే కాక వీడియో కూడా రిలీజ్ చేసినట్లు సమాచారం. తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని.. తనను ఒంటరితనం వేధిస్తోందని.. అందుకే చనిపోతున్నానని శ్రీధర్ సుసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు వెల్లడైంది.
ఐతే దర్శన్ హత్య కేసులో చిక్కుకుని జైలు పాలైన సమయంలోనే తన మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రేణుకస్వామి హత్య విషయంలో శ్రీధర్ భాగస్వామ్యం ఏమైనా ఉందా.. లేక దర్శన్ ఈ కేసులో చిక్కుకోవడంతో ఆ బాధతో లేదా తనకు భవిష్యత్ లేదనే భయంతో శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే చర్చ నడుస్తోంది.
దర్శన్ తన భార్య విజయలక్ష్మికి దూరంగా ఉంటూ.. పవిత్ర గౌడ అనే నటితో చాలా ఏళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉండడం నచ్చని రేణుక స్వామి అనే దర్శన్ అభిమాని.. పవిత్రను సోషల్ మీడియా వేదికగా దూషించడం, ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో అతణ్ని లక్ష్యంగా చేసుకున్న దర్శన్ తన సహాయకులతో కలిసి అతణ్ని చిత్ర హింసలు పెట్టి ఏకంగా హత్యే చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో పవిత్ర గౌడ ఎ-1 కాగా.. దర్శన్ ఎ-2 కావడం గమనార్హం. ప్రస్తుతం వీళ్లిద్దరూ పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు.
This post was last modified on June 19, 2024 9:59 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…